ప్రెగ్నెన్సీ సమయంలో ఉపయోగపడే అద్భుతమైన యోగాలు ఇవే..!
ఆ యోగాసనాలేవో ఇప్పుడు చూద్దాం. బద్ధకోణాసనం చేయటం వల్ల పాదాలు, నడుము భాగానికి బలం చేకూరుతుంది. అలాగే కటి ప్రాంతంలోని కండరాలు బలపడతాయి. గర్భధారణ తరువాత మూడవనెల నుంచి ప్రతి రోజు ఈ హాసనం చేయటం వల్ల 100% నేచురల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువ అని నిపుణులు చెప్తున్నారు. ఇది ఎవరైనా చెయ్యగల సులువైన యోగాసనం. గర్భణులు కూడా చేయవచ్చు. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అజిర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.
మానసిక వికాసాన్ని కలిగించే అద్భుతమైన యోగాసనాల్లో సుఖాసనం ఒకటి. దీనిని చేయటం వల్ల ఒత్తిడి, ఆందోళన, గుండె దడ వంటి ఇబ్బందులు పోతాయి. శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా కడుపులో బిడ్డకు తల్లి నుంచి సరఫరా అయ్యే అమారం, రక్తం అన్ని సక్రమంగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు. గర్భవతులు బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నట్లయితే తప్పకుండా చేయాల్సిన ఆసనాల్లో వీరభద్రాసనం ఒకటిగా నిపుణులు సూచిస్తున్నారు. రోజు కనీసం ఐదు నిమిషాలు చేయటం వల్ల శరీరం దృఢంగా మారుతుందని, చీమకుడియా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందరూ చెయ్యగల సులువైన యోగాసనం ఇది. గర్భిణులు చేయటం చాలా మంచిది. అందుకోసం నిటారుగా నిలబడి కుడి తోడ మీద ఎడమ పాదాన్ని ఉంచి, సమస్కరించే భంగిమలో చేతులు జోడించి, చాతి పై ఉంచి రెండు కాళ్లు మారుస్తు అలా 30 సెకండ్లు పాటు చేయాలి.