ఈ తొక్కతో ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.. మిలమిలా మెరవడం ఖాయం..!
నారింజలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా... గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ క్రియ కు సహాయపడతాయి. ముఖ్యంగా చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నారింజ పండు హెల్త్ కు ఎంత మంచిదో చర్మ సౌందర్యానికి కూడా అంతే మంచిది. అయితే చాలామంది ఆరెంజ్ తొక్కలను పడేస్తుంటారు. కానీ ఈ నారింజ తొక్కలతో రెట్టింపు అందాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.
దీనిలో ఉండే సహజ గుణాలు చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. ఫేస్ పై మచ్చల్ని తొలగించటంలో తోడ్పడుతుంది. పింపుల్స్ తగ్గుతాయి. వృద్ధాప్య సమస్యలు దూరం అవుతాయి. నారింజ తొక్కలను పొడి రూపంలో యూజ్ చేయాలి. ఫస్ట్ నారింజ తొక్కల్ని ఎండలో ఆరబెట్టాలి. తరువాత చిన్నగా కట్ చేసుకునే అందులో గులాబీ వేసి మిక్స్ పట్టాలి. తరువాత ఫేస్ ప్యాక్ వేసుకుంటే అందంగా మెరిసిపోతారు. మొటిమలకు, మార్చాలకు చెక్ పెట్టొచ్చు. కాబట్టి ఈ నారింజ తొక్కలను పడేయకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఫలితం తప్పకుండా ఉంటుంది. కాబట్టి నారింజ పండు తిన్నప్పుడు తొక్కలని అస్సలు పడేయకండి.