ఉదయాన్నే నిమ్మరసం తాగితే జరిగే మార్పులు ఇవే..!
దీనివల్ల రోగ నిరోధక శక్తి ఎక్కువగా అందుతుంది. అంతేకాదు ఎ, ఇ , బీ 6, విటమిన్లు, ఇనుము, రాగి, మెగ్నీషియం, కాలుష్యం, రైబోఫ్లావిన్ , జింక్ వంటివి అందుతాయి. ఎండల్లో దాహాన్ని తీర్చడంలో నిమ్మరసం నీళ్లు చక్కటి ఎంపిక. దీంట్లో పోషకాలు, రోగనిరోధకతను పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉండే నిమ్మ ఏడాది పొడవునా దొరుకుతుంది. ప్రతిసారి చక్కెరో, ఉప్పో వేసుకుని తాగే బదులుగా ... మరికొన్ని పండ్లు, పదార్థాలను కలిపి నిమ్మ నిళ్లను ఆస్వాదిస్తుంటారు కొందరు. దాహం తీరడంతో పాటు కొత్త రుచులు తెలుస్తాయి. కొంతమందికి నిమ్మరసం లేకుండా రోజు ప్రారంభం కాదు. ఉదయం నిద్ర లేచిన వెంటనే నిమ్మరసం తాగటం అలవాటు.
నిమ్మరసం నీళ్లు రోజు తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. ఒక గ్లాస్ లెమన్ వాటర్ తాగటం వల్ల మెటబాలిజం పెరిగి మలబద్ధకం సమస్య నుంచి ఉపశ్రమమం లభిస్తుంది. శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది. లెమన్ వాటర్ తాగటం వల్ల శరీరం రిఫ్రెష్ అవుతుంది. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. నిమ్మకాయ లోని సీట్రిక్ యాసిడ్ ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గొంతులో గరగరమనిపిస్తే.. వేడి నీళ్లలో చెంచా చప్పున తేనె, నిమ్మరసం కలిపి తాగితే వెంటనే ఉపశ్రమమం లభిస్తుంది. కాబట్టి దీనిని ఉదయం తప్పకుండా తాగండి.