కొలెస్ట్రాల్ని తరిమికొట్టే టిప్స్ ఇవే..!
బ్రోకలి తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. బెండకాయలో ఎక్కువ శాతం కరిగే ఫైబర్ ఉంటుంది. బెండకాయని తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. రెగ్యులర్గా బెండకాయ తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. క్యారెట్లను తీసుకుంటే కార్డియో వాస్కులర్ హెల్త్ బాగుంటుంది. క్యారెట్ లోని పోషకాలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. కాలేలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. జీర్ణ సమస్యల్ని కూడా కాలే తొలగిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వారికి కాలే మంచి ఎంపిక. వంకాయ కూడా చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది.
వంకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. వాల్నట్స్ను రెగ్యులర్గా తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి వాల్నట్స్ సహాయపడతాయి. సోయాబీన్స్ తినటంతో కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సోయా పాలు, సోయా యోగర్ట్ వంటివి కూడా తీసుకోవచ్చు. ఇది చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో సహాయపడుతాయి. బీన్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది చీనా సమస్యలను నయం చేస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా బీన్స్ సహాయపడతాయి. కాబట్టి వీటిని తప్పకుండా మీ డైలీ రొటీన్ లో చేర్చుకుంటూ మీ ఆరోగ్యానికి మంచిది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.