యూట్యూబ్ వినియోగదారులకు బిగ్ షాక్.. సబ్స్క్రైబ్ చేసేముందు ఇది తెలుసుకోండి..!
త్వరలో భారత్లో కూడా పెరిగిన ధరలు అమలు చేయనున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సౌత్ అమెరికా, ఐరోపా, ఆసియా దేశాల్లో యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రప్షన్ ధరలు మారాయి. ఇక కొలంబియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, చెర్జియం, ఐర్లాండ్, ఇండోనేషియా, ఇటలీ, మలేషియా, నెదర్లాండ్స్, సౌది అరేబియా, నార్వే, సింగపూర్, స్వీడన్, థాయ్ లాండ్, స్విడ్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనూ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఓ నివేదిక ప్రకారం.. నార్వేలో ఈ సబ్ స్క్రిప్షన ధరలు ఎక్కువగా పెరిగాయి. ఇంతకు ముందు నెలకు రూ. 950 ఉంటే ఇప్పుడది రూ.1,340 కి పెరిగింది. ఇక స్వీడన్ లో ఫ్యామిలీ సబ్ స్క్రిప్షన్ రెట్లు భారీగా పెరిగాయట.
ఇక్కడ సింగిల్ ప్లాన్ ను 18 శాతం, ఫ్యామిలీ ప్లాన్ ను 43 శాతం పెంచినట్లు తెలుస్తోంది. వివిధ దేశాల్లో యూట్యూబ్ ప్రీమియం కొత్త ప్లాన్లు అమలు అవుతున్న నేపథ్యంలో ఇండియాలో అమలు కానున్న ధరల గురించి కూడా నిపుణులు చెబుతున్నారు. ఓ వేదికగా ప్రకారం... ఇక్కడి సబ్ స్క్రప్షన్ కొత్తగా అమలులోకి వచ్చే ధరల ప్రకారం... నెలకు ఇప్పటివరకు ఉన్న రూ.129 కి బదులు రూ.149 చెల్లించాల్సి వస్తుంది. స్టూడెంట్స్ అయితే రూ.79 కి బదులు రూ.89 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఫ్యామిలీ ప్లాన్ సబ్ స్కైప్షన్ సెలెక్ట్ చేసుకుంటే గనుక రూ.189 కి బదులు రూ.299 చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే మంత్లీ పర్సనల్ ప్లాన్ తీసుకుంటే యూజర్స్ రూ.139 కి బదులుగా రూ.159 చెల్లించాలి. అదే మూడునెలలకు అయితే రూ.399 కి బదులు రూ.459, ఏడాదికైతే రూ.1290 కి బదులు రూ.1490 చెల్లించాల్సి ఉంటుంది.