అంతాన్ని మరియు ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని అలవాట్లు ఇవే..!
ఎందుకు రోజూ వారి ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, మానసిక ఆందోళనలు కూడా కారణం అవుతాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే వారిలో వయస్సుతో సంబంధం లేకుండా గ్లామర్ తగ్గవచ్చు. మిగతా వారితో పోలిస్తే వీరిలో వృద్ధాప్య ఛాయలు కనిపించే అవకాశం ఎక్కువ. కాబట్టి నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులను అవైడ్ చేయాలంటున్నారు నిపుణులు. అలాగే ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటిని ఎదుర్కొనే ఎనర్జీని సంపాదించుకోవటం ద్వారా కూడా సమస్య నుంచి బయటపడవచ్చు. అందంగా కనిపించాలంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఇక్కడ అందం అంటే నలుపు, తెలుపు వంటివి కావు.
ఎలా ఉన్నా ముఖంలో ఒక విధమైన గ్లామర్, ఆకర్షణ వంటివి కనిపిస్తాయి. దీనినే అందం అంటున్నారు నిపుణులు. అలా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. అయితే సమయం, సందర్భం లేకుండా మితిమీరిన ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యాన్ని, అందాన్ని పాడుచేస్తాయని చెప్తున్నారు. ఎందుకంటే శరీరానికి కావాల్సిన పోషకాలు లభించకపోతే ఎముకలు, కండరాలు బలహీనపడతాయి. చర్మం అందవిహినంగా మారుతుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు తగ్గిపోయి అందాన్ని దెబ్బతీస్తాయి. అలాగే ప్లాస్టిక్ కవర్లలో ఆహారాలు స్టోర్ చేసుకోని తినటం, ప్లాస్టిక్ కంటైనర్ల లో అంచ్ బాక్స్ లు కట్టుకెళ్ళడం, వేడి వేడి పదార్థాలు ప్లాస్టిక్ గ్లాసుల్లో , గిన్నెలో తీసుకొచ్చి యూస్ చేయటం వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి.