చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే చైనీస్ చిట్కాలు..!
అయినప్పటికీ వారానికి ఒక్కసారి పోషకాలు కలిగిన ప్రత్యేక శాఖాహారాన్ని తప్పక తీసుకోవటం అక్కడి ప్రజల సాధారణ అలవాటు. దీనిని చైనీస్ సాంప్రదాయ ఔషధంగా నిపుణులు పేర్కొంటారు. అలాగే వారు ఎప్పటికప్పుడు తాజా పదార్థాలను తినటం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, శరీరక స్టమ లేదా వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వటం వంటివి ఫిట్ నెస్ ను, చర్మ సౌందర్యానికి పెంచడంలో సహాయపడతాయి. చేనీయులు అన్నంలో, కూరల్లో ఉప్పు తక్కువగా యూస్ చేయరు. ఒక లిమిట్ వరకు మాత్రమే వాడతారు. అలాగే ఇతర దేశాల్లో ఉప్పు, కారం అధికంగా ఉండే స్పెపి చైనీస్ ఫుడ్స్ చాలామంది ఇష్టపడతారు. కానీ చైనాలో మాత్రం అక్కడి ప్రజలు వీటిని తక్కువగా తింటారట. ఆహారాల్లో సోడియం తక్కువగా వాడటం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.
చైనా ప్రజల చర్మ సౌందర్యానికి ఇది ఒక్క కారణం. చైనా ప్రజల్లో అత్యధిక మంది తప్పకుండా తామరాకు తో తయారు చేసిన టీని తాగుతారు. ఇది బరువు తగ్గటంలో, మూత్రపిండాల సమస్యలను దూరం చేయటంలో సహాయపడుతుంది. శరీరంలోని కొవ్వు పదార్థాలను కలిగించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు రెండు నుంచి మూడు కప్పుల వరకు తామరాకు టీని తాగటం ఆరోగ్యానికి, నిగనిగలాడే చార్మా సౌందర్యానికి సహాయపడుతుంది. ఇండియాలో యోగా మాదిరి చైనాలో సాంప్రదాయ వ్యాయామ పద్ధతిని తాయ్ చి అంటారు. అక్కడ చాలామంది దీనిని ప్రాక్టిస్ చేస్తారు. ఒత్తిడి, ఆందోళన,డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి కారణం అవుతుంది.