పిల్లలకు ఫోన్ ఇవ్వాల్సిన సరైన వయసు ఇదే..!

lakhmi saranya
ఈ రోజుల్లో పిల్లలు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. పుట్టిన వెంటనే ఫోన్ ని వాడుతున్నారు. పిల్లలకి ఎక్కువగా ఫోన్ అలవాటు అస్సలు చేయకండి. ఫోన్ అలవాటు చేయడం వల్ల పెద్దయ్యాక కూడా అదే అలవాటు అవుతుంది. డైలీ లైఫ్ లో సెల్ ఫోన్స్ వాడకం ఎక్కువైపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలను వీటికి దూరంగా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తుండగా... ఈ డిజిటల్ యుగంలో వారిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ ఏ వయసులో పిల్లలకు ఫోన్ ఇవ్వచ్చు? ఏ ఏజ్ లో ఎంత స్రైన్ టైమ్ ఉండాలి? అనే విషయాల్లో కూడా అనుమానాలు ఉండగా...
ఇక్కడ కొన్ని సూచనలు అందిస్తున్నారు నిపుణులు. ఆరేళ్ల అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన పిల్లలకు ఫోన్ ఇవ్వొచ్చని సూచిస్తున్నారు ఎక్స్ పర్ట్స్ . అది కూడా రోజులో రెండు గంటలు మాత్రమేనని చెప్తున్నారు. ఇక ఆరేళ్ల కన్నా తక్కువ ఉన్న వారికి గంట సమయం రెకమెండ్ చేస్తున్నారు. అయితే పద్దెనిమిది నెలల కన్నా తక్కువ ఉన్న చిన్నారులను అసలు అనుమతించకూడదని హెచ్చరిస్తున్నారు. లేదంటే బ్రెయిన్ డెవలప్మెంట్, కంటి చూపు, ఫోకస్ చేయటంలో లోపం ఏర్పడుతుందని చెప్తున్నారు. సోషల్ ఇంటరాక్షన్, క్రియేటివిటీ, మోటార్ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ఆఫ్ స్క్రీన్ యాక్టివిటీస్ మస్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.
కుటుంబంతో స్పెండ్ చేయడం, బయట ఆడుకోవటం, కథలు చదవటం లాంటి అలవాట్లు నేర్పాలని అంటున్నారు. ఇంట్లో ఫోన్ ఫ్రీ టైమ్ తప్పకుండా పాటించాలని... డిన్నర్ తరువాత అస్సలు మొబైల్స్ ముట్టకుండా ఉండాలని, ముఖ్యంగా బెడ్ రూమ్ లో ఫోన్ అనుమతి ఉండకూడదని చెప్తున్నారు. పిల్లలు మారం చేస్తే స్క్రీన్ టైమ్ షెడ్యూల్ చెయ్యాలని... హోం వర్క్ ఫినిష్ చేసిన తరువాత లేదంటే అప్పగించిన టాస్కులు పూర్తి చేస్తేనే ఇస్తామని కండిషన్ పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. అంతేకాదు టెక్నాలజీని ఎలా యూస్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలనే విషయాలను పిల్లలకు దగ్గురుండి నేర్పించాలని... అప్పుడే రాంగ్ కంటెంట్ చూడకుండా ఉండగలరని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: