రైతాతో భోజనం ముగిస్తున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!
ఆయుర్వేదంలో కూడా హెల్తీగా ఉండడానికి పలు నియమాలు ఉంటాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాగా ని పనులు చెప్పినవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగు, ఉల్లిపాయ కలిపి తినటం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఉల్లిపాయ వేడి చేసే ప్రభావాన్ని కలిగి ఉంటే... పెరుగు ప్రభావం చల్లగా ఉండటంలో మేలు చేస్తుంది. అలాగే పెరుగులో కాల్షియం వంటి పోషకాలను గ్రహించడానికి ఉల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు ఆటంకం కలిగిస్తాయి. కాగా దీని కాంబినేషన్ వల్ల అనర్థాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉల్లి, పెరుగు కలిపి తినటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి.
అంతేకాకుండా ఉబ్బరం, అజీర్ణ సమస్యలు వస్తాయి. సల్ఫర్ కారణంగా అతి వేడి ఉత్పత్తి అవుతుంది. టాక్సిస్ లెవెల్ ను పెంచి ... స్కిన్ పై తామర, దద్దుర్లు, సోరియాసిస్ వంటి స్కిన్ ఎలర్జీలన దారితీస్తుంది. అంతగా మీకు తినాలనిపిస్తే... పెరుగు - ఉల్లిపాయ కాంబినేషన్ నచ్చితే ఉల్లిపాయల్ని ఆయిల్ లో కాస్త వేయించి... చల్లారాక పెరుగులో కలిపి రైత తయారు చేసుకోండి. ఫ్రై వల్ల హెల్త్ ను పాడు చేసే సమ్మేళనాల ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి రైతా తినాలి అని అనుకున్నా వారు ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసుకునే తినటం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అనారోగ్య పాలవకుండా ఉంటారు. కాబట్టి రైతా తినాలి అనుకున్న వారు ఈ విధంగా తినటం చాలా మంచిది.