ఫ్రూట్స్ నుంచి మిల్క్ వరకు ప్రతి కల్తీ ఆహారాలను ఇలా చెక్ చేయండి..!

lakhmi saranya
ఆరోగ్యంగా ఉండాలంటే ఎనర్జిటిక్ ఫుడ్ ను తినాలి. ఎనర్జిటిక్ ఫుడ్ అంటే మిల్క్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ లాంటివి తినటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. పాలు డైలీ తాగటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. పాలలో ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి. కాబట్టి దీనిని డైలీ తాగటం మంచిది. ఈ మధ్యకాలంలో ప్రతిదీ కల్తీ చేస్తున్నారు. తక్కువ ఇన్వెస్ట్ చేసి తక్కువ లాభం పొందాలని దురాద్దేశంతో ఎవరు నాణ్యత ప్రమాణాలు పాటించటం లేదు. ఇటీవల సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ నెయ్యి వివాదం ఎంతటి టుమారో రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ అంశంపై దేశవ్యాప్తంగా అనేకమంది స్పందించారు. ముఖ్యంగా పండ్లకు రంగులు వేసి రోడ్లపై విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. అంత ఎందుకు రెస్టారెంట్లలోనూ ఇటీవల జరుగుతున్న దాడుల్లో అనే విషయాలు తెలుగులోకి వస్తున్నాయి. దీంతో బయట ఫుడ్ తినాలంటేనే అంతా భయపడుతున్నారు. ఈ క్రమంలోనే బయటి ఫుడ్ తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి పదార్థాన్ని ఎలా కల్తీ చేస్తున్నారు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఫుడ్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకున్నాయి.
కల్తీ ఆహారాన్ని ఎక్కువగా తినే వ్యక్తులు విరేచనాలు, గుండె జబ్బులు, అలర్జీలు, వెర్టిగో, డయాబెటిస్ వంటి వాటికి సులభంగా గురవుతారు. అంతేకాదు.. ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుందని ఇటీవల విడుదల చేసిన ఓ సర్వేలో వెల్లడింది. బయట ఫుడ్ తినే సమయంలో చాలా అపమత్రంగా  ఉండాలి. ఒక గ్లాసు నీటిలో కొన్ని చుక్కల తేనె కలపండి. తేనే నీటి అడుగుకు చేరితే అది స్వచ్ఛమైనదని అర్థం. తేనెలో పంచదార లేదా బెల్లం పాకం కలిపి కల్తీ చేస్తే అది నీటిలో పూర్తిగా కరిగిపోతుంది. లేదా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ పసుపు కలపండి. పసుపు వెయ్యగానే నీటి రంగు మారితే పసుపు కల్తీ అయిందని అర్థం. కారం విషయంలోనూ ఇదే జాగ్రత్త పాటించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: