అదరహో అనిపించే " ఆఫ్ఘాని ఎగ్ మసాలా ".. ఇంట్లో ఈజీగా ఇలా చేసుకోండి..!

lakhmi saranya
చాలామంది ఎగ్ కర్రీ ని మరింత ఇష్టంగా తింటుంటారు. ఎగ్ తినటం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. డైలీ మనం కోడిగుడ్డుని తింటం చాలా మంచిది. కర్రీలో కూడా తినవచ్చు. మరికొంత మంది ఆమ్లెట్ నీ వేసుకొని తింటారు. ఎలా తిన్నా కానీ కోడుగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. కోడుగుడ్డు కర్రీని చాలామంది ఇష్టపడతారు. గుడ్డుతో ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేయాలని కోరుకునే వారికి ఆష్టాని ఎగ్ మసాలా రెసిపీ సూపర్ ఛాయిస్. చపాతి, పులావ్, వైట్ రైస్ ఇలా ఎందులోకైనా ఈ కర్రీ అదిరిపోతుంది. తయారీ విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు చాలామంది నిలువ పచ్చడి ఏదో ఒకటి అన్నంలో వేసుకుని తింటారు.
 దీనికి సైడ్ డిష్ గా ఆమ్లెట్ వేసుకోవటం చేస్తుంటారు. లేదంటే.. ఆనియన్ ఎగ్ కర్రీ వండుకుంటారు. ఇలా కోడి గుడ్డుతో ఎన్నో రకాల రెసిపీలు చేసుకుంటారు. అందులో దేనికదే ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. అలాంటి వాటిల్లో టాప్ లో ఉండే రెసిపీ ఆష్టాని ఎగ్ మసాలా కర్రీ. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి. ఉల్లిపాయ మొక్కలు వేసి వేయించండి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసుకోవాలి. సన్నని మంట మీద ఉల్లిపాయలు మగ్గించి... ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్స్ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.
 తర్వాత మిక్సి గిన్నెలో కొత్తిమీర వేసుకుని... కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రాండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి పసుపు, కారం, ఉప్పు వేసి ఎగ్స్ వేసి వేపుకోండి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇదే పాన్లో కాస్త ఆయిల్ వేయండి. ఇందులో యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేయండి. తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర మిశ్రమం వేసుకోండి. రెండు నిమిషాల తర్వాత ఇందులో పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఫ్రెష్ క్రిమ్, పెరుగు వేసి కలుపుకోవాలి. కర్రీలో ఆయిల్ పైకి తేలిన తర్వాత కస్తూరి మేతి, గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడే ఎగ్స్ వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. సూపర్ టేస్టీ ఆష్టాని ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: