ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలా...? ఈ 4 విషయాలపై ఫోకస్ చేస్తే చాలు....

lakhmi saranya
కొంతమంది ఎందుకో తెలియదు ఆందోళనగా ఉంటూ ఉంటారు. ఏం సమస్య ఉందో తెలియదు కానీ ఆందోళనగా ఒంటరిగా కూర్చుని ఉంటారు. ఆనందం అనేది అసలు ఉండదు. ఆరోగ్యంగా కూడా అసలు ఉండరు. ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అనుకోకుండా శారీరక, మానసిక ఇబ్బందులు సంభవిస్తుంటాయి. అయితే వీటికి చాలావరకు ఎవరికీ వారే కారణం అవుతుంటారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా జీవన శైలిలో ప్రతికూల మార్పులు, పోషకాహార లోపాలు, క్షణం తీరికలేని పని పరిస్థితులు, నిరంతర ఆందోళనలు, సమయానికి తినకపోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ కు దూరంగా ఉండటం వంటివి ఇందులో భాగంగా ఉంటున్నాయి.
 ఇది సహజంగానే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని దూరం చేస్తుంటాయి. కాగా ప్రస్తుతం ఈ సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో ఎక్కువ మంది గృహిణులే ఉంటున్నారని నిపుణులు చెప్తున్నారు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని సమస్యలను దూరం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు నాలుగు విషయాలపై దృష్టి పెట్టాలని అంటున్నారు. అలాంటి వాటిలో ఫిజికల్ యాక్టివిటీస్, క్వాలిటీ స్లిప్, మెడికల్ టెస్టులు, సరైన పోషకాహారం వంటివి ఉన్నాయి. వీటిని రెగ్యులర్ గా అమలు చేస్తే అనేక వ్యాధులను నివారించవచ్చని, శరీరంలో వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం కాకుండా అడ్డుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అలాగే మానసిక వికాసానికి, ఫిజికల్ ఫిట్ నెస్ కు కూడా ఇవి చాలా ముఖ్యం. ఇంటి పనుల్లో, కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమవుతూ ఇప్పటికీ మహిళలు తమను తాము నిర్లక్ష్యం చేసుకుంటున్న వారు చాలామంది ఉంటున్నారు. సమయానికి తినక పోవటంతో పాటు శారీరక వ్యాయామాలకు దూరంగా ఉండటం వారిలో అనారోగ్యాలకు కారణం అవుతోంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయని, బీపి, మధుమేహం, గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుందని చెప్తున్నారు. వారానికి కనీసం 4 నుంచి 5 రోజులు ప్రతిరోజూ 30 నుంచి 60 నిమిషాలు వ్యాయామలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకు తగిన ఆహార నియమాలు పాటించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: