అక్కడంతా చదువుకున్నోళ్లే... ప్రపంచంలోనే ఎక్కువ అక్షరాస్యత ఉన్న దేశం ఇదే..!
అదే సందర్భంలో చదువుకు అవకాశాల్లేనివారు, తక్కువ చదువుకుంటున్నవారు, అసలు చదువుకే దూరంగా ఉంటున్న వారు కూడా పలు దేశాల్లో ఉంటున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. 'ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్' ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం... ఇప్పుడు ప్రపంచ దేశాల్లో విద్యావంతుల శాతమెలా ఉందో తెలుసుకుందాం. విద్యావంతులు ఎక్కువగా ఉన్న దేశాలేవి? ఈ సందేహం తలెత్తినప్పుడు చాలామంది అమెరికా లేదా ఇంగ్లాండ్ కావచ్చు అనుకుంటారు. కానీ అది నిజం కాదంటున్నారు నిపుణులు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు వరల్డ్ లోనే అత్యధిక మంది ఎడ్యుకేషన్ ఉన్న దేశం కెనడా.
ఇక్కడ 59.96 శాతం మంది అక్షరాస్యులు ఉన్నారు. ఇక 52.68 శాతం విద్యావంతులు కలిగిన దేశంగా జపాన్ రెండవ స్థానంలో నిలిచింది. లక్సెంబర్గ్ మూడవ స్థానంలో ఉండగా, దక్షణి కొరియా, ఇజ్రాయెల్ 4, 5 స్థానాల్లో నిలిచాయి. అమెరికా, బ్రిటన్ 6, 8 స్థానాల్లో నిలిచాయి. వినటానికి ఆశ్చర్యంగా అనిపిస్తుండవచ్చు. కానీ ప్రపంచంలో ఎక్కువమంది విద్యావంతులుగల దేశాల జాబితాలో ఇండియా పేరు లేదు. అయితే ఓఈసిడి రిపోర్ట ప్రకారం మన దేశ జనాభాలో అక్షరాస్యత రేటు 20.4 శాతంగా ఉంది. ఇక నేషనల్ స్టాటిస్టికత స్టడి గత నివేదికల ప్రకారం.. భారత్లోని ఏడు రాష్ట్రాల్లో అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. ఎక్కువ విద్యావంతులు కలిగిన రాష్ట్రాలుగా కేరళ మొదటి స్థానంలో ఉంది.