జుట్టుకి రంగు వేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి?

praveen
మారిపోయిన ఆహారపు అలవాట్లు.. టెక్నాలజీకి అనుకూలంగా మారుతున్న మనిషి జీవనశైలి.. మనిషి శరీరంలో ఎన్నో మార్పులు తీసుకువస్తుంది. ఒకప్పుడు దంపుడు బియ్యం తిని ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్న ముసలి వాళ్ళ కంటే నేటి రోజుల్లో యువత చాలా వీక్ గా కనిపిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. పాతికేళ్లు కూడా నిండకముందే ఏకంగా ముసలి వాళ్ళలా తెల్లజుట్టు రావడం కూడా నేటి రోజుల్లో కనిపిస్తుంది. ఇక ప్రతి ఒక్కరిలో ఇది ఒక పెద్ద సమస్యగానే మారిపోయింది.

 ఇంకేముంది వయస్సు ఒకలా తల మీద ఉన్న జుట్టు మరోలా కనిపించడంతో.. ఇక తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి అందరూ నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్లో దొరికే ఎన్నో హెయిర్ కలర్స్ ని వాడేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే నేటి రోజుల్లో కొంతమంది జుట్టు తెల్లబడిందని కలర్ వేసుకుంటుంటే ఇంకొంతమంది మాత్రం స్టైల్ కోసం జుట్టుకు రంగు వేసుకోవడం చేస్తున్నారు. అయితే ఇలా జుట్టుకు రంగు వేసుకునే అలవాటు ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు.

 జుట్టుకు వేసుకునే రంగు కొనేటప్పుడు అమ్మోనియా, సల్ఫేట్ ఫ్రీ, కలర్ సేఫ్ వంటి రకాలు కొనుగోలు చేయడం మంచిది అని చెబుతున్నారు. రంగు వేసుకోవడానికి ముందే చెవి వెనక ప్యాచ్ టెస్ట్ చేయాలి. కళ్ళు మండిన ఇతరత్రా అలర్జీలు తలనొప్పి వంటివి వచ్చిన ఇక వాటికి దూరంగా ఉండాలట. ఎందుకంటే రంగుల్లో వాడే అమోనియా, ప్రోస్టియన్, గ్లైకోల్, పిపిడి లాంటి కెమికల్స్ కారణంగా ఎంతో మందిలో అలర్జీలు వచ్చే అవకాశం ఉందట. అంతేకాదు కొన్ని రసాయనాల వళ్ళ వల్ల వెంట్రుకల పొడిబారి బలహీన పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఇలా జుట్టుకు రంగు వేసుకోవాలనుకున్నప్పుడు మూడు రోజుల ముందు నాణ్యమైన కండిషనర్ పెట్టి తలస్నానం చేయాలట. ఆ తర్వాత రంగు వేసుకోవడం మేలు అని నిపుణులు సూచిస్తున్నారు. తలకు రంగు వేసిన తర్వాత వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదట. ఇలా జుట్టుకు రంగు వేసుకుంటున్న వారు ఎన్నో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: