తల్లిదండ్రులకు ఈ ఓకే సంతానం.. సమస్యలకు దారితీస్తుందా?
సమాజంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని కొందరు చెప్తుంటారు. కాగా ఇందులో ఏ మాత్రం నిజం లేదని ఓ తాజా ఆధ్యాయంలో వెల్లడైంది. తల్లిదండ్రులకు ఒక్కరే సంతానంగా ఉంటున్న పిల్లలే ఎక్కువ సంతోషంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అధ్యాయనంలో భాగంగా చైనాలోని మకావూ యూనివర్సిటీకి చెందిన నిపుణులు కుటుంబంలో ఒకరు, అలాగే ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు వారిలో ఎవరు ఎక్కువ సంతోషంగా ఉంటున్నారనే విషయాన్ని తెలుసుకోనేందుకు 2.4 లక్షల మంది తల్లిదండ్రులను, వారి పిల్లలను స్టడీ చేశారు.
ఒక్కరే ఉన్న పిల్లలు, అలాగే తోబుట్టువులు ఉన్న పిల్లల మానసిక ఆరోగ్యాలను పోల్చుతూ మొత్తం 113 అధ్యాయనాల డేటాను విశ్లేషించారు. ఈ సందర్భంగా వారు తెలుసుకున్నది ఏమిటంటే.. తోబుట్టువులు ఉన్న పిల్లల కంటే కూడా, ఒక్కరే సంతానంగా ఉండే పిల్లలు ఎక్కువ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటున్నారు. ఒత్తిడి, ఆందోళన, ఓసిడి, ఇతర రుగ్మతలు వీరిలో ఉండటం లేదు. అలాగే ఐక్యూ టెస్టుల్లో, స్కూల్ సబ్జెక్టుల్లో కూడా ఒకరే సంతానమైన పిల్లలు మెరుగ్గా ఉంటున్నారని తెలిపింది. ఒకే సంతానం కావడంతో తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కువ సమయం, ఇతర వనరులు కేటాయించడం, వారి భవిష్యత్ కోసం కేర్ తీసుకోవటం వంటివి ఇందుకు కారణం అంటున్నారు నిపుణులు.