పరుగెత్తేటప్పుడు అక్కడ దురద... ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి.?

lakhmi saranya
పరిగెత్తేటప్పుడు చమట ఎక్కువగా పట్టి దురద అనేది వస్తుందా... ఆ ప్లేస్లో ఎక్కువగా దురద వస్తుందా? అయితే చెమట పట్టి రెండు కాళ్లు గీసుకుపోయి దురద అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. పరుగెత్తడం అప్పుడే ప్రారంభించిన వారు లేదా అనుభవం ఉన్నవారు కూడా కొన్నిసార్లు రన్నర్ దురద అనే చర్మ రుగ్మతకు లోనవుతారు. పరుగెత్తే సమయంలో లేదా తరువాత  కాళ్లు, తొడలు, పొత్తి కడుపులో తరచుగా దురదను అనుభవిస్తారు. ఇది సాధారణంగా హానిచేయనిది కానీ కొన్నిసార్లు పొడి చర్మం, తామర వంటి మరిన్ని పరిస్థితులకు దారి తీయవచ్చు. అయితే గురక, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, మైకం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు నిపుణులు.
 అసలు ఇది ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది తెలుసుకుందాం. పరిగెత్తెడం ప్రారంభించినప్పుడు గుండె కండరాలకు ఎక్కువ రక్తాన్ని పంపుతుంది. తద్వారా ఆక్సిజన్ కోసం పెరిగిన డిమాండ్ ను తీర్చవచ్చు. రక్త ప్రవాహంలో ఈ అకస్మిక పెరుగుదల కేశనాళికలు, ధమనులను విస్తరించడానికి కారణం అవుతుంది. ఇది చర్మం లోని నరాల చివరలను ప్రేరేపిస్తుంది. ఇది దురదకు దారితీస్తుంది. వ్యాయామ సమయంలో రక్త నాళాలు వ్యాకోచించడం వల్ల అవి మెదడుకు దురద సంకేతాలను పంపే నరాల ఫైబర్ లను ప్రేరేపిస్తాయి.
ఇది వ్యాయామం తర్వాత సహజ ప్రతిస్పందన. కానీ ఇది చికాకు కలిగించవచ్చు. పరుగెత్తినప్పుడు శరీర  ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివలన చెమట పట్టటం, చర్మం రంధ్రాలు తెరుచుకోవడం జరుగుతుంది. బట్టలు, చర్మం మధ్య వేడి, చమట ఘర్షణ కలయిక దురదకు దోహదం చేస్తుంది. 2017లో జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజి ప్రకారం... వర్కౌట్ సెషన్ సమయంలో మరియు తరువాత హిస్టామిన్ అస్థిపంజర కండరాలతో సన్నిహితంగా చేరి ఉండవచ్చు. ఇది చర్మపు రోగనిరోధక ప్రతిస్పందనలో చేరి రక్త నాళాలను విడదీసి దురదను తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో రన్నర్ దురద వ్యాయామం – ప్రేరిత ఉర్టికేరియా లక్షణం కావచ్చు. శారీరక స్టమ వల్ల చర్మంపై దురదర్లు కనిపిస్తాయి. ఇది సాధారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుదల ద్వారా ప్రేరేపించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: