రోడ్ సైడ్ ముంత మసాలా ఇంట్లోనే చేసుకోండి ఇలా... ఈ టిప్స్ తో చేస్తే సూపర్ టేస్ట్..!

lakhmi saranya
రోడ్ సైడ్ ముంత మసాలా తింటే మంచి రుచిగా ఉంటుంది. ఆ టేస్టీ మనం ఇంట్లో చేసుకున్నా గానీ రాదు. బయట చేసింది చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకో తెలియదు. ఇంట్లో కూడా మంద మసాలా రోట్ సైడ్ చేసేటట్టు చేయాలనుకుంటున్నారా. అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముంత మసాలా, ఈ పేరు వింటేనే చాలామంది మౌత్ వాటర్ ఇన్ అవుతుంది. కొంచెం కారంగా... కొంచెం ఉప్పగా.. కొంచెం పుల్లగా ఉండే దీనిని తింటే కలిగే ఫీలింగ్ వేరే లెవెల్. అలా సాయంత్రం సమయాన అలా నడుచుకుంటూ దీనిని తింటుంటే వచ్చే కిక్కు వేరేగా ఉంటుంది. మరమరాలు, నిమ్మరసం, మసాలాలు, ఉల్లిపాయ ముక్కలు ఇలా ఒక్క డేమిటి ... అందులో ఉన్న ప్రతి రుచి అమోఘమే. అయితే చాలామంది రోడ్ సైడ్ బండ్ల మీద లభించే రుచితో...
 దీనిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారు. కానీ.. ఆ టేస్ట్ మాత్రం రాదు. అలాంటప్పుడు కొన్ని ట్రిప్స్ పాటిస్తూ ముంత మసాలా చేసేస్తే టేస్ట్ అమోఘం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మరమరాలను క్రిస్పిగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ తరువాత అదే పాన్ లో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినా తర్వాత కార్న్ ప్లేక్ వేసి ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ కార్న్ ఫ్లేక్స్ అంటే పాలలో వేసుకుని తినేవి కాకుండా.. చిప్స్ తో పాటు లభించే కార్న్ ఫ్లేక్స్ వాడాలి.
ఇప్పుడే అదే నూనెలో పల్లీలు వేసి ఎర్రగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ పెద్ద బౌల్ తీసుకుని అందులోకి వేయించిన మరమరాలు, కార్న్ ఫ్లేక్స్ వేసి చేత్తో ప్రెస్ చేస్తూ కలపాలి. ఇందులోకి ఉల్లిపాయ తరుగు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, చాట్ మసాలా, నెయ్య, నిమ్మరసం, వేయించిన పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్ లో ఉప్పు, కారం, పసుపు చూసుకుని తక్కువ ఉంటే మరి కొంచెం కలుపుకోవచ్చు. కావాలంటే మిర్చి బజ్జిని కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. అంతే రూట్ సైడ్ లభించే రుచితో ముంత మసాలా రెడీ. రోడ్డుమీద టేస్ట్ లాగానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: