ఉసిరికాయ విత్తనాలు పడేస్తారా..? ఈ సీక్రెట్ తెలిస్తే అసలు వదలరు...!

lakhmi saranya
ఉసిరికాయని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఉసిరికాయ పచ్చడిని కూడా పెట్టుకోవచ్చు. ఉసిరికాయని తిని గింజని పడేస్తున్నారా. గింజలో కూడా ఎన్నో పోషకాలు కలిగి ఉన్నాయి. ఉసిరికాయను సంస్కృతంలో అమలకి అంటారు. ఉసిరి ఆరోగ్యం ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతిరోజు ఒక ఉసిరికాయ తిన్న, ఉసిరికాయ జ్యూస్ తాగుతున్న ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా జుట్టు, చర్మ సంరక్షణలో ఉసిరిది అందె వేసిన చెయ్యి. అదేవిధంగా విటమిన్-సి పుష్కలంగా ఉండటం మూలాన ఇది బరువు తగ్గటంలోనూ, వృద్ధాప్యాన్ని దారి చేరనీయకుండానూ, రక్తంలో చక్కెర స్థాయిలను నియంతరించడంలోనూ సహాయపడుతుంది.
 చాలామంది ఉసిరికాయలు తిని అందులో విత్తనాలు పడేస్తుంటారు. కానీ ఉసిరికాయ విత్తనాల గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుంటే.. ఉసిరికాయను సూపర్ ఫ్రూట్ లాగా ఎలాగైతే పరిగణిస్తారో.. ఉసిరికాయ విత్తనాలు కూడా అంతే ప్రభావవంతంగా ఉంటాయి. ఉసిరికాయ విత్తనాలు జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడతాయి. ఉసిరికాయ విత్తనాలు వాడితే జుట్టు రాలటం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఉసిరికాయలో ఫైబర్ ఉండటం వల్ల ఇది జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇవి అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశ్రమమం కలిగిస్తాయి. ఉసిరికాయ విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి...
చర్మాన్ని తేమగా ఉండటంలో సహాయపడతాయి. ఉసిరికాయ గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచివిగా పరిగణించబడతాయి. ఈ కారణంగా ఉసిరికాయ గింజలు కూడా తీసుకుంటే గుండె ఆరోగ్యం బాగుంటుందని అంటున్నారు. ఉసిరికాయలు మాత్రమే కాదు... ఉసిరి గింజలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంతరించడంలో సహాయపడతాయి. మధుమేహం సమస్య ఉన్నవారు ఉసిరికాయ, ఉసిరి విత్తనాలు రెండు తీసుకోవచ్చు. ఉసిరికాయ విత్తనాలలో కూడా విటమిన్-సి, ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయటంలో సహాయపడతాయి. పేలవమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారు ఉసిరికాయను తీసుకోవటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: