మీ ముఖంపై ఫ్యాట్ పెరిగిందా...? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?
కొత్త బట్టలు వేసుకునే అందంగా ముస్తాబయ్యాక స్మార్ట్ ఫోన్లలో ఫోటోలు దిగితే మొఖం అందంగా కనిపిస్తుంది. కాగా ఫేస్ ఫ్యాట్ తగ్గించి... అందంగా కనిపించాలంటే ఈ ఈజీ టిప్స్ ఫాలో అయితే చాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం. శరీరంలో వాటర్ శాతం తక్కువగా ఉంటే ఫేస్ పై కొవ్వు పెరుగుతుంది. సరైన నిద్ర లేకపోవడం, అసమతుల్యమైన ఆహారపు అలవాట్ల కారణంగా, హార్మోన్లలో మార్పులు వంటివి ముఖంపై ఫ్యాట్ పెరుగుతుంది. కూల్ వాటర్ తో ఫేస్ కడగండి. దీంతో బ్లడ్ సర్కులేషన్ సక్రమంగా జరుగుతుంది. ఒక క్లాత్ తీసుకుని ఐస్ మొక్కల్ని అందులో వేసి..
ఫేస్ పై మసాజ్ లాగా చేసుకోండి. దీంతో వాపు తగ్గుతుంది. అలాగే దోస ముక్కల్ని పేస్ట్ లా చేసి ఫేస్ పై అప్లై చేయండి. దీంతో కళ్ళ చుట్టూ వాపును తగ్గించడంలో మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఆంటీ ఇన్ఫ్లు మేటరి లక్షణాలు అధికంగా ఉండే గ్రీన్ టీ బ్యాగ్ లను చల్లార్చి ఫేస్ పై కాసేపు అలా ఉంచండి. అలోవెరా జెల్ ను ముఖానికి రాసుకుంటే వాపు తగ్గుతుంది. దీనిలో పోషకాలు వాపు తగ్గించడంలో మేలు చేస్తాయి. కేవలం వాపు మాత్రమే కాకుండా ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. ఆహారంలో ఉప్పు వాడగాన్ని తగ్గించండి. ఈ చిట్కాలు వరుసగా వారం రోజులు కనుక ఫాలో అయితే మీ అనుకున్న మీ ముఖ అందం మీ సొంతం అవుతుంది.