మొబైల్ ఫోన్ ఉపయోగించటం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు ఇవే..?
దీనిని సాధారణంగా ' డిజిటల్ ఐ స్ట్రెయిన్' లేదా 'కంప్యూటర్ విజన్ సిండ్రోమ్' అని పిలుస్తారు. మొబైల్ ఫోన్ స్క్రీన్స్ బ్లూ లైట్ ను విడుదల చేస్తాయి, ఇది కళ్ళలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది, ఇది అస్పష్టమైన దృష్టి, పొడి కళ్ళు, తలనొప్పి, ఫోకస్ చేయటంలో ఇబ్బంది వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ప్రచురించబడిన ఆధ్యాయనం ప్రకారం.. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు, దీన్ని యూస్ చేయనివారితో పోలిస్తే కంటి నొప్పి, కళ్ళు పొడిబారటం ప్రమాదం 39.7 శాతం ఎక్కువ ఉంటుంది.
సోషల్ మీడియా ద్వారా టెక్స్ట్ చేసుకున్నప్పుడు లేదా స్కోరింగ్ చేస్తున్నప్పుడు.. కుంగిపోయిన స్థితిలో కూర్చోవటం సాధారణం. కాగా ఈ భంగిమ వల్ల సాధారణంగా టెక్స్ట్ నెక్ అని పిలవబడే పరిస్థితి ఏర్పడుతుంది. మీ ఫోన్ ని ఉపయోగిస్తున్నప్పుడు మీ తలను ఎక్కువ సేపు ముందుకు ఉంచడం వల్ల మీ మెడ, భుజాలలోని కండరాలు దృఢంగా, నొప్పిగా మారినప్పుడు ఇది జరుగుతుంది. టెక్స్ట నెక్ దీర్ఘకాలిక నొప్పికి దారితీస్తుంది. పరిష్కరించకపోతే దీర్ఘకాలిక సమస్యలకు కూడా దారితీస్తుంది. పీర్ జర్నల్ ప్రచురించిన అధ్యాయనంలో మొబైల్ ఫోన్ వినియోగదారులలో నెక్ డిజార్డర్స్, టెక్స్ట నెక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడించింది.