బంతిపూలలో అనేక ఔషధ గుణాలు... అవేంటంటే..!
చాలామంది ఆయుర్వేద వైద్యులు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. మ్యారీ గోల్డ్ లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మ్యారిగోల్డ్ పువ్వులలో యాంటీ ఫంగల్, యాంటీ- అలెర్జీ, యాంటీ- ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చార్మా సమస్యలతో పాటు క్యాన్సర్, ట్యూమర్ లో వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడడంలో సహాయపడతాయి. బంతి పువ్వులలో విటమిన్ ఏ, విటమిన్ బి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక రకాల వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి. ఇది ముఖ్యంగా జుట్టు రాలటం,చుండ్రు,
తలలో ఫంగస్ వంటి జుట్టు సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు. దీని కారణంగా జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. వాయిద్య నిపుణుల ప్రకారం చుండ్రును తొలగించడానికి బంతి పువ్వులు, వేప ఆకులను ఉపయోగించడం సహజమైన మార్గమని చెబుతున్నారు. దీనికోసం ఈ రెండిటిని రెండు కప్పుల నీటిలో వేసి మరిగించి, నీరు సగానికి తగ్గినప్పుడు, అందులో నూనె కలిపి తలకు పట్టించాలని చెబుతున్నారు. మ్యారిగోల్డ్ పువ్వులు, దీని ఆకులలో ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆకులను, కొబ్బరి నూనెలో వేడి చేసి, చల్లారాక జుట్టుకు నూనెల రాసుకోవాలి. ఇలా చేయటం ద్వారా జుట్టు అందంగా నిగనిగా లాడుతూ కనిపిస్తుంది.