జుట్టు సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా?.. అయితే ఈ నాలుగు విధానాలు పాటించండి..!
ఎందుకంటే హెయిర్ స్పా వల్ల జుట్టు రాలటం, చిట్లటం, చుండ్రు సమస్యలు దూరం అవుతాయి. అలాగే హెయిర్ మీకు నచ్చినట్లుగా తయారై... దగదగ మెరిసిపోతుంది. కాగా పదిహేను రోజులకొకసారి హెయిర్ స్పా ట్రీట్మెంట్ తీసుకోండి. అయితే హెయిర్ స్ఫా కోసం పార్లర్ కు వెళ్తే డబ్బు ఖర్చు అవుతుందిగా అని ఆలోచిస్తున్నారా? అలాంటి సందేహాలు ఏం పెట్టుకోకుండా ఏం చక్కా మనీ ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా హెయిర్ స్పా చేసుకోండి. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా సరే హెయిర్ స్పా కు ముందు కొబ్బరి నూనెను పెట్టుకోవాలి. లేకపోతే ఆలివ్ ఆయిల్ పెట్టుకున్నా పర్లేదు. ఈ ఆయిల్ ను కాస్త వేడి చేసి హెయిర్ కు అప్లై చేయాలి.
పదిహేను నిమిషాల అనంతరం మరింత ఆయిల్ వేసి ముప్పై నిమిషాల పాటు మసాజ్ చేయండి. తర్వాత జుట్టుకు ఆవిరి పట్టించండి. అనంతరం వేడి వాటర్ తో టవల్ ను ముంచి వెంట్రుకలను కట్టుకోండి. దీంతో హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఆవిరి మాత్రం 10 నిమిషాల కన్నా ఎక్కువగా పెట్టకూడదు. ఆవిరి పట్టాక షాంపూతో హెయిర్ క్లీన్ చేసుకోండి. వేడి వాటర్ తో తలకు పోసుకోవద్దు. అలా చేస్తే హెయిర్ పోషణ తగ్గే అవకాశాలు ఉంటాయి. అలాగే హెయిర్ చివర్లో చిట్లిపోయినట్లు ఉంటే.. దీనికి చెక్కు పెట్టడానికి హెయిర్ మాస్క్ అప్లై చేయండి. హెయిర్ మాస్క్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. లేకపోతే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. జుట్టుకు హెయిర్ మాస్క్ అప్లై చేశాక షాంపూ తో శుభ్రంగా కడుక్కోవాలి. దీంతో హెయిర్ హెల్తీగా ఉంటుంది.