లైపోసక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసా..?

lakhmi saranya
లైపోసక్షన్ సమస్య ఉన్నవారు చాలా లావుగా ఒప్పుగా అనిపిస్తుంటారు. ఈ సమస్య చాలా మందిని వేధిస్తుంది. అధిక కొవ్వును తొలగించడం ద్వారా శరీరంలోని నిర్దిష్ట ప్రాంతాలను నాజూకుగా మలిచే ప్రక్రియ. అర్హత కలిగిన, బోర్డు - సర్టిఫైడ్, అనుభవజ్ఞుడైన ప్లాస్టిక్ సర్జన్ ద్వారా నిర్వహించబడినప్పుడు సురక్షితంగా మరిగణించబడుతుంది. ఆహారం, వ్యాయామంతో తగ్గని సామస్యాత్మక కొవ్వు నిల్వలను తగ్గించేందుకు ఉద్దేశించబడిన ఈ సర్జరీ ద్వారా... చాలామంది పురుషులు ప్రయోజనం పొందారు. ఎందుకంటే ఇది గైనెకోమాస్టియా సర్జరీకి కూడా సహాయపడుతుంది. అయితే ఇతర శస్త్రచికిత్స వలె... లేపోసక్షన్ కూడా ప్రమాదాలు, దుప్ప్రభావాలను కలిగి ఉండగా.. సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించటం ఎలాగో చూద్దాం. కొవ్వు తొలగింపు.. చికిత్స చేసే ప్రాంతాలు, వయస్సు, అంతర్లీన వైద్య పరిస్థితులు వంటి అంశాలు ఫలితంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఉదాహరణకు లైపోసక్షన్ కు వయోపరిమితి లేనప్పటికీ... వ్యక్తి చర్మ స్థితిస్థాపకత, ఆరోగ్యం, ప్రక్రియ కోసం సంసిద్ధత పై అనుకూలత ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. రోగులకు ఏదైనా కాస్మెటిక్ ప్రక్రియ గురించి సలహా ఇచ్చేముందు వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరీక్షించడం సర్జన్ బాధ్యత. అంతర్లీన వ్యాధితో బాధపడుతున్న వారికి దగ్గరి పర్యవేక్షణ అవసరం. ఉదాహరణకు మధుమేహ వ్యాధిగ్రస్తులు. వారి మధుమేహం బాగా నియంత్రించబడి, శస్త్రచికిత్సకు ముందు చేసిన పరీక్షల్లో ఒకే అయితేనే లైపోసక్షన్ చేయించుకోవచ్చు. అదేవిధంగా హైపర్ టెన్సివ్ రోగులను శస్త్రుచికిత్సకు ముందు, ఆ సమయంలో, తరువాత జాగ్రత్తగా చూసుకోవాలి. ఫలితాలను తెలుసుకోవడానికి క్షుణ్ణంగా ఆరోగ్య పరిక్ష, వివరణాత్మక సాంప్రదింపులు అవసరం.
తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, పేలవమైన జీవనశైలి అలవాట్లు ఉన్న వ్యక్తులు ప్రత్యామ్నాయాలను పరిగణించవలసి ఉంటుంది. గుండె జబ్బులు, నరాల సంబంధిత రుగ్మతలు, బలహీన రోగనిరోధక వ్యవస్థలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు అధిక ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. ప్రక్రియ తరువాత ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించలేని వారికి దీర్ఘకాలంలో లైపోసక్షన్ ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. అందుకే పే షెంట్ సెలక్షన్ నుంచి సర్జరీ వరకు ప్రతి అడుగు అత్యంత జాగ్రత్తగా వేయాలి. ప్రమాదం, దుష్ప్రభావాలను తగ్గించడానికి... మైక్రో ఎయిర్, VASER వంటి ఆధునిక సంకేతికత ప్రభావవంతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: