రోగ నిరోధిక శక్తిని రెట్టింపు చేసే అంజీర్.. పరగడుపున తింటే ఎన్ని లాభాలు అంటే..!
ఇందులో అన్ని రకాల విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరంలో రోగా నిరోధక శక్తిని పెంచడం ద్వారా అనేక అనారోగ్యాలను దూరం చేస్తుందని నిపుణులు అంటున్నారు. అధిక రక్తపోటును అధిక బరువును తగ్గించటంలోనూ అంజీర పండు సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో సోడియం, పిండి పదార్థాలు, కొవ్వులు కూడా తక్కువ ఉంటాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడం ద్వారా డయాబెటిస్ ను ని అంతరిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంతో అధిక బరువు తగ్గడంలో సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా విటమిన్ సి, జింక్ వంటి ఖనిజాలు కలిసి ఉన్నందున ఇమ్యూనిటీ పవర్ పెంచడం ద్వారా దగ్గు, జ్వరం, జలుబు వంటి సీజనల్ ఆరోగ్యాలని నివారించడంలో అంజీర పండు సహాయపడుతుంది. అయితే దీనిని ఉదయం ఖాళీ కడుపుతో తినటం ద్వారా అధిక ప్రయోజనాలు ఉంటాయి. అలా కాకుండా అల్పాహారంలో చేర్చుకోవడం ద్వారా కూడా తినవచ్చు. ఎండిన అంజీర అయితే నీటిలో నానబెట్టి తింటే బాగుంటుంది. కాగా కిడ్నీ స్టోన్స్, కడుపునొప్పి, లివర్ సమస్యలు, మైగ్రేన్ తో బాధపడేవారు మాత్రం తినవద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు అసలు దీనిని తినకండి.