స్త్రీలు మరియు పురుషులలో ఎవరి గుండె వేగంగా కొట్టుకుంటుందో తెలుసా..!

lakhmi saranya
మగవాళ్ళు ఆడవాళ్లు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ గుండె సమస్య వచ్చేస్తుంది. గుండె మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. దీనిలో ఏ రకమైన లోపం వచ్చిన మొత్తం శరీరానికి హాని కలిగిస్తుంది. గుండె గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో స్త్రీ, పురుషుల మధ్య ఎవరి గుండె వేగంగా కొట్టుకుంటుందో ముందుగా తెలుసుకుందాం. నిపుణుల ప్రకారం సగటున ఒక మహిళ గుండె పురుషుడి కంటే కొంచెం వేగంగా కొట్టుకుంటుంది. సాధారణంగా ఒక మహిళ గుండె నిమిషానికి 70-85 బీట్ల వేగంతో కొట్టుకుంటుంది. అయితే మనిషికి గుండె 60 -80 వేగంతో కొట్టుకుంటుంది.
కార్డియాలజీ నిపుణులు ఏం చెబుతున్నారంటే సాధారణంగా పురుషుల కంటే మహిళల గుండె చప్పుడు ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. ఈ వ్యవ్యాసం మహిళా గుండె చిన్న పరిమాణంలో ఉండటం వలన ఉంటుందంటున్నారు. అందుకే మహిళల గుండె కాస్త కష్టపడి పని చేయవలసి ఉంటుందంటున్నారు నిపుణులు. దీంతో పురుషుల కంటే స్త్రీల గుండె ఎక్కువగా కొట్టుకుంటుంది అంటున్నారు. గుండె ప్రతిరోజు సగటున 1 లక్ష సార్లు కొట్టుకుంటుందని, ఇది ఒక వ్యక్తి శరీరం అంతటా సుమారు 2,000 గ్యాలన్ల రక్తాన్ని పంప్ చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ గుండె పనితీరులో ఏదైనా సమస్య ఏర్పడితే రక్తాన్ని పంప్ చేసే గుండె సామర్థ్యం దెబ్బతింటుంది.
 ఇది గుండె వైఫల్యానికి కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. గుండెకు సొంత విద్యుత్ వ్యవస్థ ఉందని వాయిద్యాన్నిపనులు చెబుతున్నారు. దీనినే కార్డియాక్ కండక్టన్ సిస్టమ్ అంటారు. గుండె కార్డియాక్ కండక్షన్ సిస్టమ్ లో ఏదైనా లోపం వల్ల కార్డియాక్ అరెస్ట్ సంభవించవచ్చని చెబుతున్నారు. ఇది మరణానికి కారణం అవుతుందని చెబుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ నివారించడానికి, ధూమపానం, మద్యపానం మానుకోవాలని చెబుతున్నారు. నవ్వడం కూడా గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. నవ్వడం వల్ల రక్తప్రసరణ 20% పెరుగుతుందని చెబుతున్నారు. నవ్వడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: