ఈ గడ్డి అత్యంత పవిత్రం.. ఇది లేకుంటే పూజలే చేయము.. ఎందుకలా..?

lakhmi saranya
ఈ గడ్డిని చాలామంది వినాయకుడికి ఇష్టంగా భావిస్తారు. ఈ గడ్డిని ఎక్కువగా వినాయకుడికి పెడుతూ ఉంటారు. భారతీయ హిందూ సాంప్రదాయంలో పర్యావరణానికి కూడా దేవుడి హోదా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో కనిపించే కుశ గడ్డి లేకుండా మతపరమైన ఆచారాలు అసంపూర్ణంగా పూర్తి అవుతాయి అంటున్నారు పండితులు. ఈ పవిత్రమైన గది వ్యవసాయ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ గడ్డి చిన్న గుబ్బలను ఉంటుంది. ఇది నేల పై వ్యాపించి సాధారణంగా సున్నితంగా, మృదువుగా ఉంటాయి. కుశ గడ్డి స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇది అనేక మతపరమైన సాంప్రదాయాలు , పూజ స్థలాలలో వినియోగిస్తారు.
 ఈ గడ్డితో ఆ ప్రదేశం పవిత్రతను పెంచుతుంది అంటున్నారు పండితులు.
ఈ గడ్డి నేల సారాన్ని పెంచుతుంది.అంతే కాదు పంటలో తెగుళ్ళ ను ని అంతరించడంలో కూడా సహాయపడుతుందట. అలాగే పశుగ్రాసంగా, భూమిని సారవంతంగా చేయడానికి ఉపయోగించబడుతుందని చెబుతున్నారు. ఇది వర్షాపు నీటిని పీల్చుకోవటంలో, నేల కోతను అరికట్టడంలో సహాయపడుతుంది. పండుగలలో కుచ. పూజలు, వేడుకలు, హోమాల్లో కుశ గడ్డిని తప్పకుండా ఉపయోగిస్తారు. రక్షాబంధన్, మకర సంక్రాంతి వంటి పండుగలలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కుశ గడ్డి వేర్లను జపమాలలో పూసలు గా చేసి ఉపయోగిస్తారు. దీని ద్వారా పాపాల తొలగిపోతాయి అంటున్నారు పండితులు.
అనారోగ్యంతో బాధపడే వారు ఉపశమనం పొందుతారు. అంతేకాదు దీని ద్వారా కలుషితాలు శుద్ధి అవుతాయని చెబుతున్నారు. అందుకే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో దీనికి ఓ ప్రత్యేక గౌరవం, స్థానం ఉంది. ఈ కుశ గడ్డిని ఎర్ర వస్త్రంతో చుట్టి ఇంట్లో పెట్టడం వలన మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఆయుర్వేద వైద్యుల ప్రకారం కుశ గడ్డిని వాపు, నొప్పి వివరిణిగా ఉపయోగిస్తారు.అంతే కాదు జగన వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది సహాయపడుతుందంట. కుశ గడ్డితో మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశ్రమణాన్ని పొందవచ్చు అంటున్నారు నిపుణులు. కుశ గడ్డిలో వివిధ విటమిన్లు, ఖనిజాలు ఉంటాయని చెబుతున్నారు. ఇవి శరీరానికి పోషణను అందిస్తాయి. ఈ గడ్డి ఆంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: