పాన్ కార్డులో వివరాలు మార్చాలనుకుంటున్నారా?.. అయితే ఇలా చేయండి..!
ఆన్ లైన్లో పాన్ కార్డ్ లో ఉన్న తప్పులను సరిదిద్దుకునేందుకు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. దీనికోసం ముందుగా ఇన్ కమ్ టాక్స్ ఇండియా అధికారిక వెబ్ సైట్ www.incometaxindia.gov.in కి లాగిన్ అవ్వండి. మీ పాన్ నవంబర్‌ను నమోదు చేసి లాగిన్ చేయండి. ఇలా చేసిన తర్వాత పాన్ కార్డ్ కరెక్షన్ ఎంపికను ఎంచుకోండి. ఇప్పుడు స్కిన్ పై అడిగిన అన్ని వివరాలను పూరించండి. అలాగే అవసరమైన అన్ని పత్రాలను అప్ లోడ్ చెయ్యండి. ఇలా చేసినా తర్వాత ఫారమ్ ను సమర్పించండి. దీనికోసం మీరు సుమారు రూ.106 కరెక్షన్ ఫీస్ చెల్లించాలి. ఫీస్ చెల్లించిన తర్వాత సబ్బిట్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత రసీదు స్క్రీన్ పై వస్తుంది.
రసీదు పై ఇచ్చిన నెంబర్ ద్వారా మీ పాన్ కార్డ్ ఎక్కడ, ఎప్పుడు వస్తుందో మీరు ట్రాక్ చేయవచ్చు. అంతేకాదు మీకు కావాలంటే, మీరు NSDL e-GOV పోర్టల్ ని సందర్శించి పాన్ కార్డులో దిద్దుబాటులు చేసుకోవచ్చు. మీరు ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే దిగువ వచ్చిన ప్రక్రియను అయితే సరిపోతుంది. దీనికోసం మీరు మీ ఇంటికి సమీపంలో ఉన్న పాన్ సేవా కార్యాలయానికి వెళ్లాలి. ఇక్కడ మీరు పాన్ కార్డులో తప్పులు సవరణ కోసం ఫారమ్ ను నింపాలి. ఫారమ్ ను పూరించిన తర్వాత ఆ షారమ్ కు అవసరమైన పత్రాలను జత చేయండి. పాత్రాలను సరిగ్గా జత చేసిన తరువాత ఫారమ్ ను సమర్పించండి. దీని తర్వాత కొత్త పాన్ కార్డ్ కొద్ది రోజుల్లో మీ ఇంటికి డెలివరీగా వస్తుంది.