భారత్ లో అంతా మెషిన్ లే.. ఎవరూ సంతోషంగా లేరు అంట?
ఆనందంగా జీవించడం అనే సామూహిక కొలతను నిర్వచించడం చాలా కష్టం అనే చెప్పాలి. ఒక్కొక్కరి దృష్టిలో సంతోషంగా బతకాడానికి ఒక్కో రకంగా నిర్వచిస్తుంటారు. ఇందులో ప్రధానంగా ఆర్థిక అవకాశం, విద్య అనేవి కచ్చితంగా ప్రజల శ్రేయస్సును పెంపొందించగలవు. ఈ సమయంలో రే డాలియో గ్రేట్ పవర్స్ ఇండెక్స్ -2024 నుంచి ప్రపంచంలో సంతోషకరమైన దేశాలు తెరపైకి వచ్చాయి.
అవును. . ఈ ప్రపంచంలో సంతోషకరమైన దేశాలు ఏమిటనే విషయాన్ని తాజాగా రే డాలియో పరిశీలించింది. ఈ సందర్భంగా ఓ మెథడాలజీని ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగా సంతృప్తికర జీవితం, రోజూవారీ ఆనందంలో నివేదించిన జనాభా వాట, మంచి సోషల్ నెట్ వర్క్ మద్దతు, ప్రతీ లక్ష మందికి ఆత్మ హత్య రేటును ప్రామాణికంగా తీసుకుంది.
ఈ జాబితా ప్రకారం ప్రపంచంలో సంతోషకరమైన దేశంగా యునైటడ్ కింగ్ డమ్(యూకే) మొదటి స్థానంలో ఉంది. 2024లో 143 దేశాల్లో యూకే 20వ స్థానంలో ఉన్నట్లు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు తో ఈ తాజా నివేదిక విభేదించినా పాత తరాల్లో ఈ ర్యాకింగ్ అధిక స్థాయిలో సంతోషాన్ని కలిగి ఉందని చెబుతున్నారు. ఐరాసతో పాటు ఇతర గ్లోబల్ ఇండెక్స్ లు అదే విధంగా సూచిస్తున్నాయి.
ఇక ఈ జాబితాలో ఇండోనేషియా రెండో స్థానంలో నిలిచింది. ఈ దేశంలో 79 శాతం పౌరులు తాము చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఇక అగ్ర రాజ్యం అమెరికా పదో స్థానంలో నిలిచింది. దీంతో ఆర్థిక బలం ఎల్లప్పుడూ ఆనందంతో సంబంధం ఉండదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక ఇదే సమయంలో గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో యువతరంలో స్వీయ నివదికత ఆనందం తగ్గుతోందని చెబుతున్నారు. ఇక ఫైనల్ గా భారత్ దేశం చివరి స్థానంలో ఉండటం గమనార్హం. ఆదాయ అసమానతలు, పరిమిత సామాజిక మొబిలిటీ, సంస్థలపై విస్త్రృతమైన అపనమ్మకం దీనికి కారణం అని చెబుతున్నారు.