క్వాంటిటికి మంచి కాఫీ తాగుతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా?
అయితే ఈ రెండిటిలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ వయోజనకరం, ఏది ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి హాని కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్నేషనల జర్నల్ ఆఫ్ స్ట్రోక్ లో ప్రచురించిన అధ్యాయనంలో 25,000 మందికి పైగా నిర్వహించిన ఒక ఆధ్యాయంలో ప్రతి రోజు నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగటం మెదడు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని, స్ట్రోక్ ప్రమాదాన్ని 40 శాతం పెంచుతుందని వెల్లడించింది. ఇక టీ తాగటం వల్ల స్ట్రోక్ రిస్క్ 20 శాతం తగ్గుతుంది.
ఎందుకంటే తరచుగా కాఫీ తాగటం వల్ల అధిక రక్తపోటు వచ్చి గుండె జబ్బులు వచ్చి అవకాశాలు పెరుగుతాయని, ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అధ్యాయనంలో Uk, కెనడాతో సహా 32 దేశాల నుండి 26,950 మంది వ్యక్తులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది పురుషులు, వారి వయస్సు దాదాపు 60 సంవత్సరాలు. ఈ వ్యక్తులలో చాలామంది సగటు బరువు కంటే ఎక్కువగా ఉన్నారు. ఇది స్ట్రోక్ ప్రధాన ప్రమాద కారకం. అంతేకాదు వారి వైద్య చరిత్ర, ఆహారపు అలవాట్లు, శరీరక శ్రమ, ధూమపానం, అధిక రక్తపోటుకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఈ అధ్యాయంలో చేరుస్తారు. వారి టీ లేదా కాఫీ అలవాట్ల గురించి కూడా ఆధ్యాయంలో తెలుసుకున్నారని చెబుతున్నారు.