ఒత్తిడిని జయించే అద్భుత సూత్రం...24 గంటల..8.8.8 నియమం!
అలాంటి వాటిలో రూల్ 8.8.8 కూడా ఒకటి అంటున్నారు మానసిక నిపుణులు. ఇంతకీ దీని అర్థం ఏమిటి? ఎలా పని చేస్తుందో చూద్దాం. బడిదుడుకుల జీవితంలో.. ఒత్తిడి అనే సుడిగుండంలో ఒక్కసారైనా చిక్కుకోకుండా ఎవరు బయటపడరు. లైఫ్ లో అది కూడా ఒక భాగం అని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే దీనిని ఎలా నిర్వహించాలో, ఎలా తిప్పి కొట్టాలో తెలియకపోవటమే ఇక్కడ సమస్యగా మారుతుంది అంటున్నారు. చదువు, ఆరోగ్యం, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఏదో ఒకస్థాయిలో ఒత్తిడికి గురిచేస్తాయి.
కొన్నిసార్లు అవి అధికమైతేనో, వాటికి తోడు ఇంకేమైనా సమస్యలు వచ్చిపడితేనో ఒత్తిడి రెట్టింపు అవుతుంది. నిద్రలేమి కూడా వెంటాడవచ్చు. అయితే ఒత్తిడి మిమ్మల్ని చిత్తు చేసే మహామ్మారిలా అనిపించవచ్చు. కానీ పరిష్కారం లేని సమస్య మాత్రం కాదు. ఈ ప్రపంచంలో ఎవరికీ లేనిదైతే అస్సలు కాదు. కాకపోతే మీరు కాస్త మారాలి. ఆ మార్పే సమయ పాలన. మీ దినచర్య విషయంలో ఒక టైమ్ సెట్ చేసుకుని దానిని జయిస్తూ పోవటం చాలా ఈజీ అంటున్నారు నిపుణులు. అందుకు 8.8.8 సూత్రం చక్కగా ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. పర్సనల్ అండ్ ప్రోఫెషనల్ లైఫ్ లో ఎదురయ్యే ఒత్తిడిని బ్యాలెన్స్ చేయడంలో 8.8.8 ఒక గొప్ప ఆయుధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.