పెళ్లి పేరుతో అప్పులపాలు అవుతున్న యూత్... ఇదో సరికొత్త ట్రెండ్..!

lakhmi saranya
ఈరోజుల్లో వివాహం చేసుకోవటానికి ఎంతో ఖర్చు పెట్టి ఘనంగా చేస్తున్న సంగతి తెలిసిందే. వివాహం గ్రాండ్గా జరుపుకునే అప్పుల పాలు అవుతున్న విషయం కూడా తెలిసిందే. వివాహ పరిశ్రమ గణనీయమైన మార్పుకు సాక్ష్యంగా నిలిచింది. తమ జీవితంలో ప్రత్యేకమైన రోజు నువ్వు మరింత ప్రత్యేకంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రులపై ఆధారపడకుండా సొంత నిధులు ఖర్చు చేస్తున్నారు. లేదంటే వ్యక్తిగత రుణాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే వెడ్డింగ్ లోన్స్ తీసుకుంటున్నారు. ఆ తరువాత ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. అసలు ఇలా ఎందుకు, ఎవరి మెప్పు కోసం చేస్తున్నారు? నివేదికలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుందాం.
వెడ్డింగ్ లోన్ ట్రెండ్ కు అసలైన కారణాలు వ్యక్తిగతీకరణ, యూనిక్ పీరియన్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్డ్ వెడ్డింగ్స్ ప్లాన్ చేసుకోవటం. తద్వారా ఇంస్టాగ్రామ్ వంటి   మీడియాలో ధ్రువీకరణ, లైక్ ల గురించి ఆరాటపడే ఆలోచన. కాగా ఇండియాలెండ్స్ వెడ్డింగ్ స్పెండ్స్ రిపోర్ట్ 2.0 ప్రకారం... తమ వివాహాలకు స్వయం నిధులు సమకూర్చాలని ప్లాన్ చేసుకున్న 26 శాతం మందివధూవరులు వ్యక్తిగత రుణాలను పరిగణనలోకి తీసుకుంటారు. రుణం తీసుకోవాలనుకుంటున్న వారిలో 68 శాతం మంది రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల మధ్య లోన్ కు ప్లాన్ చేసుకున్నారని నివేదించింది. గ్లోబల్ ట్రావెల్ యూప్ స్కైస్కానర్ ద్వారా 'డెస్టినేషన్' ఐ డూ' అని తాజా సర్వే డెస్టినేషన్ వెడ్డింగ్ లపై భారత దేశంలో పెరుగుతున్న ప్రేమను వెలుగులోకి తెచ్చింది.
 దాదాపు 85 సైతం మంది ఇందుకోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఆర్థిక భవిష్యత్తును పణంగా పెడుతున్నారని హెచ్చరించింది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అదనపు ఒత్తిళ్లతో కూడుకుని ఉంటాయి. రిమోట్ లొకేషన్లకు వెళ్లటం, వెడ్డింగ్ ప్లానర్ లను నియమించుకోవడం, లగ్జరీ గ్రూప్ బస్సులను బుక్ చేసుకోవడం, విస్తృతమైన డెకర్ లను క్రియేట్ చేయటం వంటి ఖర్చులకు తరచుగా వివాహ రుణాలు అవసరమవుతాయి. అనువైన లోన్ ఎంపికలు, వేగవంతమైన ఆమోదాల సౌలభ్యం అధికంగా స్వతంత్రంగా ఉన్న జంటలకు వివాహ రుణాలు బెస్ట్ ఆప్షన్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: