100 దాటి బతుకుతామా? సాధ్యాసధ్యాల పై అధ్యయనం ఏం చెప్తుందంటే...!
ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించిన జనాభా నుంచి మరణ డేటాను విశ్లేషించిన తరువాత ఎలాంటి రిజల్ట్ తో ముందుకు వచ్చింది. మెరుగైన ప్రజారోగ్య సదుపాయం, వైద్య ఆవిష్కరణల కారణంగా 20 వ శతాబ్దంలో అధిక- ఆదాయ దేశాలలో ఆయుర్దాయం సుమారు 30 సంవత్సరాలు పెరిగింది. కానీ 21 వ శతాబ్దంలో ఎక్కువ ఆయుర్దాయం ఉన్న ప్రాంతాలలో పుట్టిన మగవాళ్లలో ఐదు శాతం, ఆడవారిలో 15 శాతం మంది మాత్రమే 100 ఏళ్లకు చేరుకుంటారని అధ్యాయనం తెలిపింది. 1990 నుంచి జీవిత కాలపు అంచనాలు క్షణించయిని...
జీవ వృద్ధాప్య ప్రక్రియలను గణనీయంగా తగ్గించకపోతే మానవ జీవిత పొడిగింపు ఈ దశాబ్దంలో అసంభవమని అభిప్రాయపడింది. జపాన్, ఆస్ట్రేలియా, అనేక యూరోపియన్ దేశాలలోని దీర్ఘాయువు ప్రాంతాలలో డేటాను విశ్లేషించారు పరిశోధకులు. 1990 నుంచి 2019 వరకు మరణాల డేటా పై జరిపిన ఆధ్యాయనం ఈ కాలంలో ఆయుర్దాయం కేవలం 6.5 సంవత్సరాలు పెరిగినట్లు కనుగొంది. 1990 నుంచి మెరుగుదల లో క్షీణత ఉందని.. US లో వాస్తవానికి ఆయుర్దాయం తగ్గిందని గుర్తించింది. మెరుగైన రిజల్ట్ సాధించాలంటే... ఆంటీ ఏజింగ్ థెరపిలలో పురోగతి, వయస్సు - సంబంధిత వ్యాధులకు విరుద్ధంగా కొత్త మందులు అవసరమని చెప్తున్నారు. మరి జనాలు 100 సంవత్సరాల వరకు జీవిస్తారని భావించవద్దని... అందుకే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నట్లయితే 100 వరకు ఉంటారని అనుకోవద్దని అంటున్నారు.