సీతాఫలంతో స్వీట్ రబ్టీ తయారీ విధానం...!
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్న సీతాఫలంతో స్వీట్ రెసిపీ సీతాఫల్ రబ్టీ చేస్తే రుచి అదిరిపోతుంది. ప్రస్తుత రోజుల్లో ఏ కార్యక్రమాలలో అయినా రబ్టీ తప్పక ఉండాల్సిందే. కాగా ఈ సింపుల్ రెసిపీ తయారీ విధానం ఎలాగో చూద్దాం. లీటర్ పాలు తీసుకోవాలి. 1/4 కప్పు బెల్లం, 1 సీతాఫలం గుజ్జు, 1/2 టీస్పూన్ యాలుకల పొడి తీసుకోవాలి. గార్నిష్ కోసం పిస్తా తరుగు, సిల్వర్ పూత రేకు, గులాబీ రేకులు, కుంకుమపువ్వు కలిపిన పాలు తీసుకోవాలి. ఫస్ట్ పాలను ఒక గిన్నెలో పోసి మరిగించాలి. సగానికి ఇంకిపోయి, చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి.
తరువాత అందులో యాలకుల పొడి, పంచదార లేదా బెల్లం, సీతాఫలం గుజ్జు వేసి కలపండి. ఈ విశ్వమంతా కరిగాక ... స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. చల్లారాక అందులో కుంకుమ పువ్వు కలిపిన పాలు అలాగే పిస్తా పప్పులు, గులాబీ రేకులు, సిల్వర్ వార్క్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే సీతాఫల్ రబ్టి తయారైపోయినట్లే. ఈ స్వీట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి తింటే అసలు వదిలిపెట్టరు. అందరూ కూడా ఈ స్వీట్ ని ఒక్కసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కాబట్టి సింపుల్ గా ఇంట్లోనే తయారు చేయవచ్చు.