పల్స్ రేట్ ఎక్కువైతే ఎలాంటి వ్యాధులు తలుచుతాయో తెలుసా..!

lakhmi saranya
మనం ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే హాస్పటల్ కి వెళ్తాం కదా. హాస్పిటల్ కి వెళ్లిన వెంటనే పల్స్ చెక్ చేస్తారు. ఫస్ట్ అయితే పల్స్ నే చెక్ చేస్తారు. ఎందుకో తెలియదు ముందుగా పల్స్ రేట్ చెక్ చేసాకే అప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ ఇస్తారు. ఎవరైనా ముందుగా హాస్పటల్కు వెళ్ళగానే డాక్టర్లు పల్స్ రేట్ చెక్ చేస్తారు. పల్స్ రేట్ నేచురల్ కంటే ఎక్కువగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే పల్స్ రేట్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా చెబుతుంది. వెలికి చిన్న పరికరాన్ని పెట్టి పల్స్ రేట్ ఎంత ఉందో వైద్యులు చెక్ చేస్తారు.
 ఇదే అన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తికి ఎంత పల్స్ రేట్ ఉండాలి...? ఎలాంటి వ్యాధులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒక వ్యక్తికి పల్స్ రేట్ 60 నుంచి 100 బీట్ల వరకు ఉండాలి. క్రీడాకారులు పల్స్ రేట్ అయితే ఒక్కోసారి 60 కంటే ఎక్కువ గానే ఉంటుంది. వయసును బట్టి పల్స్ రేట్ ఎంత ఉండాలంటే...? నవజాత శిశువుకు 70 నుంచి 190, 11 నెలల పిల్లలు 70 నుంచి 160 వరకు, 10 ఏళ్ల పిల్లలకు 70 నుంచి 120 వరకు, 11 నుంచి 17 సంవత్సరాల వారికి 60 నుంచి 100 బీట్ల వరకు, పెద్దల్లో 60 నుంచి 100 వరకు పల్స్ రేట్ ఉండాలి.
ఇంతకంటే ఎక్కువైతే ఏదో సమస్య ఉన్నట్టు గుర్తించాల్సిందే. పల్స్ రేట్ అసాధారణంగా ఉంటే గుండెపోటు వస్తుంది. చాతి నొప్పి, గుండెలో దడ, కాంతిని చూడలేకపోవటం, బలహీనంగా అనిపించడం, జ్ఞాపక శక్తి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాగా ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు చెప్తున్నారు. పల్స్ రేట్ మరి ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్లని కలవండి. తగిన జాగ్రత్త తీసుకోవటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: