బీరు తాగితే నిజంగా బరువు పెరుగుతారా?
సాధారణ బీరు దాదాపు 355 ML ఉండవచ్చు, ఇందులో దాదాపు 150 కేలరీలు ఉంటాయి, క్రాప్ట్ బీర్లు, స్టౌట్ లలో మరింత ఎక్కువగా ఉంటాయి. అనేక అధ్యాయనాలు బీర్ వినియోగం, బరువు పెరుగుట మధ్య సంబంధాన్ని వివరించాయి. మితమైన బీర్ వినియోగం నేరుగా బరువు పెరగడానికి దారి తీయకపోవచ్చు, అధికంగా తీసుకోవటం వల్ల శరీరంలో కేలరీలు పెరగడానికి దోహదం చేస్తుంది. దీని ఫలితంగా కాలక్రమేణా బరువు పెరగవచ్చు. అంతేకాకుండా బీర్ లోని ఆల్కహాల్ కంటెంట్ జడ్జిమెంట్ ను దెబ్బతీస్తుంది. పేలవమైన ఆహార ఎంపికలకు దారితీస్తుంది.
బరువు పెరిగేందుకు కారణం అవుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రీషన్ లో ప్రచురించబడిన ఆధ్యాయణం ప్రకారం, బీరుతో సహా అధిక ఆల్కహాల్ వినియోగం అధిక కేలరీలు తీసుకోవడానికి దారితీస్తుంది. ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. జర్నల్ బబేసిటి రివ్యూస్ లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం... అధిక ఆల్కహాల్ వినియోగం జివక్రియ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది. బరువు పెరగడానికి దారితీస్తుంది. ముఖ్యంగా పొత్తికడుపు ప్రాంతం చుట్టూ కొవ్వు పెరుగుతుంది. తక్కువ కేలరీలు బీర్లు లేదా లైట్ బీర్ లను ఎంచుకోవడం వల్ల తక్కువ కేలరీలను పొందే అవకాశం ఉంటుంది. బరువు పెరిగే అవకాశం ఉండదు.