మూడు దశాబ్దాల్లో 18 శాతం పెరిగిన స్ట్రోక్ ముప్పు... కారణాలు ఇవే..!
ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా యువతలో కూడా ఈ ప్రాబ్లం కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. మెదడులోని కొత్త భాగానికి బ్లడ్ సప్లై నిలిచే పోవటం లేదా అక్కడి రక్తనాళాలు చిట్లిపోవటం వల్ల స్ట్రోక్ వస్తుంది. ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా పలువురిని వేధిస్తున్న స్ట్రోక్ లలో ప్రధానంగా రెండు రకాలు ఉంటున్నాయి. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ కాగా.. ఇది మెదడులో ధమనులు బ్లాక్ అయినప్పుడు సంభవిస్తుంది. ఇక రెండవది హెమరేజిక్ స్ట్రోక్ కాగా.. బ్రెయిన్ లో రక్తనాళాల చిట్లిపోవడం వల్ల ఇది వస్తుందని న్యూరాలజిస్టులు పేర్కొంటున్నారు. సరిపడని లేదా చెడు ఆహారపు అలవాట్లు, పేలవమైన జీవనశైలి, బిపి, షుగర్, ఒబిసిటీ,
హైపర్ కొలెస్టె రోలేమియా వంటి హెల్త్ ఇష్యూస్ కారణంగా కూడా స్ట్రోక్ లేదా పక్షవాతం ముప్పు పెరుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇటీవలి ఓ ఆధ్యాయణం ప్రకారం... ట్రాక్ చేయడం, సెకండ్ హ్యాండ్ స్ట్రోకింగ్ కారణంగా కూడా బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ పెరుగుతోంది. 50 ఏండ్లకంటే తక్కువ ఏజ్ కలిగిన వారిలో రోజుకు 20 సిగరెట్ల వరకు కాల్చడం వల్ల స్ట్రోక్ ముప్పు రెండింతలు పెరుగుతోందని నిపుణులు పరిశోధకులు గుర్తించారు. దీంతోపాటు ధూమపానం, మద్యపానం అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పును మరింత పెంచుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలని, హెల్త్ డైట్ మెయింటైన్ చెయ్యాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.