ఉల్లిపాయ కోస్తే కళ్ల నుంచి వాటర్ వస్తున్నాయా? కారణం ఏమిటో చూద్దాం?

lakhmi saranya
చాలామందికి ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళంటా నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకో తెలియదు ఎక్కువగా వాటర్ అనేది వస్తాది.కొన్ని ఉల్లిపాయలు కోసినంత మాత్రాన కళ్ళ నుంచి నీళ్లు రావు. మరి కొన్ని ఉల్లిపాయలు చాలా ఘాటుగా ఉండటం మూలా మరి ఎక్కువగా కళ్ళ నుంచి నీళ్లు వస్తాయి. భారతీయులు తప్పకుండా వంటకాల్లో ఉల్లిపాయను ఉపయోగిస్తారు. ఉల్లిపాయ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కానీ ఉల్లిపాయ కట్ చేస్తుంటే కన్నీళ్లు వస్తుంటాయి.
 అలా ఎందుకు వస్తాయి? దీనికి కారణం ఏమిటని ప్రతి ఒక్కరిలో సందేహం కలిగే ఉంటుంది. ఉల్లిపాయలో కళ్లను మండించే ఒక రసాయన పదార్థం ఉంటుంది. దీన్నే సీన్ ప్రోపాంథైల్ ఎస్ ఆక్సైడ్ అంటారు. ఇది కంటిలో ఉండే లాక్రిమల్ గ్రంధిని ప్రోత్సహిస్తుంది. దీంతో ఉల్లిపాయ కట్ చెయగాన కళ్ళ నుంచి నీళ్లు కారుతుంటాయి. కళ్ల నుంచి వాటర్ పోవటం కూడా మంచిదేనంటున్నారు నిపుణులు. ఎందుకంటే గాలిలో ఉన్న ధూళి కణాలు మన కంట్లోకి వెళ్తాయి. కాగా అవి నీటి ద్వారా బయటకు వస్తాయి.
 ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు షార్ప్ గా ఉన్నా కత్తిని వాడాలి. దీంతో కళ్లు తక్కువగా మండుతాయి. వాటర్ కూడా తక్కువగా వస్తాయి. అలాగే ఉల్లిపాయలు కోసేటప్పుడు కోవ్వోత్తిని దగ్గర పెట్టుకోండి. ఉల్లి నుంచి వచ్చే గ్యాస్ కోవ్వోత్తిలోకి వెళ్లి కళ్ళ నుంచి నీళ్లు కాకుండా చేస్తాయి. దీంతో చికాకు తగ్గుతుంది. కాబట్టి ఈ విధంగా చేస్తే కళ్ళ నుంచి నీళ్లు రావు. ఉల్లిపాయ కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ గా ఉన్న కత్తిపీట మీద ఉల్లిపాయ కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏదన్నా చిన్న తేడా వస్తే వెంటనే చెయ్యదగి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మనకే మంచిది. ఉల్లిపాయ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: