ఆర్థిక స్థితర్వతమే జీవన భద్రత.. ఇది పాటిస్తే లైఫ్ బిందాస్!
అయితే చాలామంది చేసే ఆర్థిక పొరపాటు ఏమిటంటే... తమ ఆర్థిక స్తోమతకు మించి జీవించే ప్రయత్నం చేస్తుంటారు. కొత్త ఫోన్, కొత్త డిజైనర్ అవుట్ ఫీట్, కొత్త బైక్, కొత్త కారు... ఇలా ప్రతి ఒక్కటి అవసరమా... కాదా? అనే దానితో సంబంధం లేకుండా కొనేస్తుంటారు. దీంతో ఖర్చులు విరిగిపోయి, అప్పులు చేస్తుంటారు తప్ప ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేద్దామని కోణంలో ఆలోచించరు. ఆ అలవాటు వదులుకోకపోతే మీ భవిష్యత్తు ఆర్థిక స్వేచ్ఛను హరిస్తుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అప్పు చేస్తుంటారు. అయితే మీ ఆర్థిక వనరులు, ఆదాయం, తీర్చగలిగే స్తోమతను బట్టి చేయాలంటున్నారు నిపుణులు. అంతేకాకుండా సమయానికి తీర్చగలగాలి. క్రెడిట్ కార్డులను కూడా దీనిని దృష్టిలో పెట్టుకునే యూజ్ చెయ్యాలి.
ఇది పరోక్షంగా మీ ఆర్థిక స్థిరాత్వానికి సహాయపడుతుంది. ఉదాహరణకు ఒకసారి లోన్ తీసుకొని క్రమంగా తీర్చితే... మరోసారి ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికో, ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన అప్పును మంజూరు చేయడానికి ఆర్థిక సంస్థలు, బ్యాంకులు మొగ్గు చూపుతాయి. అలా కాకుండా ఎగ్గొడితేనో, సక్రమంగా కట్టకపోతే మీరు మరోసారి అప్పు పుట్టదు. అప్పులు చేసి వ్యాపారాలు పెట్టడం, పెళ్లిళ్లు చెయ్యడం, ఇల్లు కట్టుకోవటం వంటివి చేస్తున్నవారు ఎందరో ఆర్థికంగా ఎదిగినవారు ఉన్నారు. అందుకు కారణం వారు కట్టాల్సిన అప్పులను విస్మరించకపోవడం కూడా ఒకటి. చాలామంది జాబ్ చేస్తూనే రిటైర్మెంట్ పొదుపు ఉంటుంది అనుకుంటారు. దీని అర్థం అది కాదు. మీ శేష జీవితం ఆనందంగా ఉండాలంటే ప్రస్తుత సంపాదనలో కొంత భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలి. కానీ కొందరు దీనిని విస్మరిస్తుంటారు.