ఒత్తిడిని పెంచే ఆహారాలు ఇవే.. తగ్గించుకుంటేనే బెటర్!

lakhmi saranya
చాలామంది ఎక్కువ స్ట్రెస్ కు గురవుతూ ఉంటారు. బయట ఫుడ్ తినటం వల్ల ఎక్కువ స్ట్రెస్ కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయట ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆహారాలలో ఆరోగ్యానికి మేలు చేసే గుణమే కాదు,అధికంగా తీసుకుంటే అనారోగ్యాలకు, మానసిక ఒత్తిడికి గురి చేసే లక్షణం కూడా కొన్నింటిలో ఉంటుంది. కాబట్టి తరచుగా స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవారు కొన్ని రకాల ఫుడ్స్ కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం. ఒత్తిడి అంటే ఫిజికల్ గా .. మెంటల్ గా ఆందోళనకు గురికావడం.
సాధారణంగా ప్రతికూల ఆలోచన, బాధాకరమైన సంఘటన వంటివి ఇందుకు కారణం అవుతుంటాయని అందరికీ తెలిసిందే. అయితే కొన్ని రకాల ఆహారాలు కూడా ఒత్తిడికి గురిచేస్తాయని నిపుణులు అంటున్నారు. ఆ సందర్భంలో నిరాశ, నిస్పృహ, కోపం, ఆత్రుత వంటి భావాలు అధికం అవుతాయి. ఒత్తిడి స్థాయిని బట్టి తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. డ్రెస్ రిలేటెడ్ ఆహారాలు, పానీయాల విషయానికి వస్తే మద్యం, జంక్ ఫుడ్స్, స్వీటెనర్లు, టి, కాఫీ వంటివి ప్రధానం గా ఉంటున్నాయి. మద్యం లేదా ఆల్కహాల్ అధికంగా సేవించే వారిలో సహజంగానే ఒత్తిడి, చికాకు వంటివి కనిపిస్తాయి.
ఇక ఫాస్ట్ లేదా జంక్ ఫుడ్స్ కూడా వాటిలోని పదార్థాలు, రసాయనాలు రక్తనాళాలపై ప్రతికూల ప్రభావం చూపడంతో ఆందోళన, ఒత్తిడి వంటి భావాలకు దారితీస్తాయి. కృత్రిమచక్కెరలు లేదా స్వీటెనర్స్ ఎక్కువగా తీసుకోవటం రక్తపోటును, మధుమేహాన్ని మరింత పెంచుతాయి. దీంతో ఒత్తిడి మరింత పెరుగుతుంది. కాఫీ 2 3 కప్పులు తాగితే మేలు చేస్తుంది. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం అందులోని కెఫీన్ నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వండి సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ కి గురైనప్పుడు కాఫీ చాలా తక్కువగా తాగటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: