గ్రామాలలో దొరికే సీమ వంకాయ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు....!
వంకాయలో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో సీమ వంకాయ ఒకటి. ఇవి చాలామందికి ఎక్కువగా తెలియదు. కానీ ఇవి గ్రామాలలో ఎక్కువగా లభిస్తాయి. సీమ వంకాయ చూడడానికి డిపరెంట్ గా ఉంటుంది. కానీ రుచి మాత్రం వేరే లెవెల్. మరి ఆరోగ్య ప్రయోజనాలంటారా? ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సీమ వంకాయ తింటే మధుమేహంతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ రక్తం స్థాయిలను నియంతరించి కంట్రోల్ చేస్తాయి. అలాగే హెయిర్, స్కిన్ ప్రాబ్లమ్స్ కు చెక్ పెడతాయి.
సిమ వంకాయలో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు బాడిలోని ఫ్రి రాడికల్స్ ను, విష పదార్థాలను బయటకు పంపించడంలో తోడ్పడుతాయి. తద్వారా స్కీన్ తళతళ మెరిసిపోతుంది. హెయిర్ ను స్ట్రాంగ్ గా ఉంచడంలో మేలు చేస్తుంది. ఈ వంకాయలోని పిచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వెయిట్ లాస్ అవ్వడానికి, ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా ప్రెగ్నిన్సీ మహిళలకు సిమ వంకాయ మంచిది. దీనిలో ఫోలెట్ అధికంగా ఉంటుంది. కాగా ఆహారంలో సిమ వంకాయ చేర్చుకుంటే తల్లికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా సిమ వంకాయ గుండె ఆరోగ్యాన్ని మొరుగుపర్చడంలో చాలా మేలు చేస్తుంది. దీనిలో పిచు, పదార్ధాలు, పోటాషియం గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.