ఐదు వ్యాయామాలతో ఈ అవయవం సేఫ్.. రోజుకి 30 నిమిషాలు చేస్తే చాలు...!
ఫ్యాటి లివర్ వ్యాధికి వ్యాయామమే బెస్ట్ మెడిసిన్ అని తరచూ వైద్య నిపుణులు చెబుతూనే ఉంటారు. బాగా కాలేయ పనితీరు మెరుగుపరుచుకోవాలంటే వ్యాయామం తప్పకుండా చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. కాగా వ్యాయామాన్ని కనుక అలవాటు చేసుకుంటే మీ లైఫ్ స్టైలే ఛేంజ్ అవుతుంది. సైకిల్ తొక్కడ, డాన్స్ వంటివి కాలేయాన్ని శుభ్రపరచడంలో మేలు చేస్తాయి. అంతేకాకుండా కొవ్వును కూడా కరిగిస్తాయి. వ్యాయామం గంటల తరబడి చేయనక్కర్లేదు. రోజు కేవలం 30 నిమిషాలు చేస్తే సరిపోతుంది. కాలేయ ఆరోగ్యం మీ సొంతవుతుంది. లివర్ మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం.
ఇది రక్తాన్ని శుభ్రపరచడంలో, ఆహారాన్ని జీర్ణం చేయడంలో జీవక్రియను వేగవంతం చేయడంలో ఎంతో సహాయపడుతుంది. కాగా లివర్ను కాపాడుకోవాలంటే ఈ ఐదు వ్యాయామాలు తప్పనిసరిగా మీ జీవితంలో భాగం చేసుకోండి. బ్రిస్క్ వాకింగ్ చేయండి. ఈ వ్యాయామం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. అలాగే కాలేయంలోని కొవ్వు కరిగిపోతుంది. రెండవది హైకింగ్. కొండలు ఎక్కడ, ఎత్తయిన ప్రదేశాలను ఎక్కండి. దీంతో మీ కాలేయాన్ని టాక్సిన్స్ లేకుండా ఉంచుతుంది. పుష్ అప్ స్క్వాట్ వ్యాయామాలు చేయండి. ఈ వ్యాయామం జీవక్రియ పనితీరును మెరుగు పరుస్తుంది. హైలేట్స్ వ్యాయామం. ఇది శారీరక శక్తిని పెంచడమే కాకుండా శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఫ్యాటి లివర్ వ్యాధిని తగ్గించటంలో హైలెట్స్ బాగా పని చేస్తుంది.