యమ్మీ యమ్మీ దొండకాయ నిల్వ పచ్చడి తయారీ విధానం..!
పొట్టలో కొవ్వు పెరిగితే దొండకాయ తినవచ్చు. అలాగే గుండె సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలకు పచ్చి దొండకాయను తింటే మంచిది. అయితే దొండకాయతో టేస్టీ టేస్టీ పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకుని రెండు నెలల పాటు నిలవ ఉంచుకోవచ్చు. తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా దొండకాయల్ని నిలువుగా కట్ చేసుకుని.. వీటిలో వెల్లుల్లి, రుచికి సరిపడా కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత మెంతులు, జీలకర్ర పొడి, వేయించిన మూడు స్పూన్ల ఆవాల పొడి వేసుకోవాలి. అలాగే కాస్తమా రసం వేయాలి. ఇప్పుడు నా ఈ తీసుకుని ఆయిల్ వేసి అందుల ఆవాలు, జీలకర్ర, ఎండిమిర్చి, శనగపప్పు వేసి వేయించాలి.
తర్వాత ఈ పోపును దొండకాయ విశ్రమంలో వేసి మొత్తం బాగా కలపాలి. ఈ విశ్రమాన్నంతా ఒక గాజు సిసాలో పెట్టుకోవాలి. రెండ్రోజుల తరువాత పదను లేని స్పూన్ తో కలుపుకోవాలి. అంతే దొండకాయ నిల్వ పచ్చడి తయారైనట్లే. రెండు నెలల పాటు టేస్ట్ పోకుండా రుచిగా ఉంటుంది. ఇంకా రుచిగా ఉండాలి అంటే ఫ్రిజ్లో పెట్టుకుంటే మంచిది. టేస్టీ టేస్టీ దొండకాయ చట్నీ రెడీ అయినట్లే. వేడివేడి అన్నంలో ఈ దొండకాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుంది. కాబట్టి మీరు కూడా ఈ దొండకాయ పచ్చడిని తయారు చేసుకోండి. ఒక్కసారి తయారు చేసుకునే తింటే మళ్లీ మళ్లీ తినాలి అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి.