పిస్తా పప్పులు మరియు పాల కాంబినేషన్.. ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు..!
ఇక పాల ప్రయోజనాలు చూసినట్లయితే.. పాలు సంపూర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగితే శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుతాయని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు. పాలలో శరీరానికి కావాల్సిన కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రోటీన్లు, కేలరీలు, సహజ కొవ్వు, విటమిన్ డి, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. కాగా పాలు తాగితే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. బాడీని ఫీట్ గా ఉంచడమే కాకుండా ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచుతాయి. డయాబెటిస్ పేషెంట్ల కు పాలు మంచి ఔషధంగా చెప్పుకుంటారు.
కాగా ఇన్ని ప్రయోజనాలు ఉన్న పాలు పిస్తా పప్పులలో మరిగించి తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం. ఇస్తా పాలు మరిగించి తాగితే బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. పిస్తాలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కీళ్ల నొప్పులు తగ్గించడంలో మేలు చేస్తాయి. ఈ పాలు కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి ఎంతో మంచివి, చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి పిస్తా పాలు తాగటం ఆరోగ్యానికి మంచిది. పిస్తా పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి వీటిని తాగటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. డైలీ తప్పకుండా ఉదయం పిస్తా బాదం పాలు తాగండి.