కాఫీ తో మధుమేహం?.. నిపుణుల అధ్యయనంలో షాకింగ్ నిజాలు..!
కార్టియో వాస్క్యులర్ వ్యాధుల ముప్పును కెఫిన్ లెవెల్స్ డిసైడ్ చేస్తాయని పరిశోధకులు అంటున్నారు. టిఫిన్ ఎలాంటి వ్యాధులతో ముడిపడి ఉంటుందో తెలుసుకునే ఉద్దేశంతో 2023 లోని 10 వేలమందిపై నిర్వహించిన జెనెటిక్ డేటాబేస్ అధ్యాయన వివరాలను బ్రిటన్ లోని ఇంపిరియల్ కాలేజ్, అలాగే యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, స్విడన్ లోని కరోలిన్ స్కా ఇన్స్టిట్యూట్ లకు పరిశోధకులు సంయుక్తంగా మరోసారి ఎనలైజ్ చేశారు. స్టడిలో భాగంగా ఏయే జన్యువులు కెఫిన్ తో సరిపోలుతున్నాయనే విషయాన్ని పరిశోధకులు అబ్జర్వ్ చెయ్యగా...
ఎక్కువ మొత్తంలో కాఫీ తాగే వారి బాడీలోని కెఫిన్ లెవెల్స్ టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ను పెంచుతున్నట్లు గుర్తించారు. అంటే రోజుకు 4 కప్పులకు మించి తాగే వారిలో కాఫీలోని కెఫీన్ పదార్థం వారి గ్లూకోస్ లెవెల్స్ ను పెంచడం ద్వారా ఇన్సులిన్ నిరోధకతు దారితీస్తుంది. దీంతో అది టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ను పెంచే అవకాశం ఉంది. అలాగే రోజుకు 2 నుంచి 3 కప్పుల వరకు మితమైన కాఫీ వినియోగం టైప్ 2 మధుమేహం వచ్చే రిస్క్ ను 23 నుంచి 50 శాతం తగ్గించగలదని ఈ సందర్భంగా పరిశోధకులు వెల్లడించారు. మొత్తానికి కాఫీ ఎక్కువైతే హానికరం... తక్కువైతే ఆరోగ్యకరం అనేది పరిశోధకులు తేచ్చారు.