40 ఏళ్ళ త‌ర్వాత మ‌హిళ‌ల్లో వ‌చ్చే వ్యాధులు ఇవే.. !

RAMAKRISHNA S.S.
మహిళలు 40 ఏళ్ల తర్వాత తమ ఆరోగ్యంపై చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఎందుకంటే 40 ఏళ్ల తర్వాత సంభవించే అనేక మార్పులు.. శారీరక, మానసిక సమస్యలు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అందుకే 40 ఏళ్ల తర్వాత అలాంటి అనారోగ్య సమస్యల భారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య‌రంగ‌ నిపుణులు సలహాలు ఇస్తున్నారు. మహిళలు సాధారణంగా తమ ఆరోగ్యం గురించి అంతగా శ్రద్ధ పెట్టరు. అలా శ్రద్ధ పెట్టని పక్షంలో 40 ఏళ్ల తర్వాత వచ్చే అన్ని హోర్మోన్ల మార్పుల ప్రభావం వల్ల రకరకాల శారీరక, మానసిక సమస్యలు తప్పవు.

1) బోలు ఎముకల వ్యాధి :
40 సంవత్సరాల తర్వాత శరీరంలో ఈస్ట్రోజన్ హోర్మోన్‌ తగ్గటం ప్రారంభమవుతుంది. హార్మోన్ ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిపరిమాణం తగ్గటం ప్రారంభమైనప్పుడు ఎముకలు కూడా బలహీనంగా మారుతాయి. కాల్షియంతో పాటు ఇతర పోషకాలు కలిగిన ఆహారాన్ని తినడం, వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
2) గుండె వ్యాధులు :
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కంటే గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే 40 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు తమ గుండెపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తక్కువ కొలెస్ట్రాల్ ఆహారం తీసుకోవడంతో పాటు. జాగ్రత్తలు పాటించాలి.
3) మోనోపాజ్:
ఇది ఒక వ్యాధి కాదు. కానీ.. స్త్రీ జీవితంలో ఒక దశ. చాలామంది మహిళలకు ఇది సవాలుగా మారుతుంది.
శరీరంలోని అనేక హోర్మోన్ల అసమతుల్య‌త కారణంగా ఈ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వైద్య నిపుణుల పర్యవేక్షణలో దీనికి చికిత్స‌ తీసుకోవాలి.

4) రొమ్ము క్యాన్సర్ :
30 నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న మహిళలను రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకోసం సంవత్సరానికి ఒకసారి మామోగ్రామ్ చేయించుకోవాలి. ప్రముఖ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడుని సంప్రదించాలి.
5) ఒత్తిడి, మానసిక రుగ్మత :
40 ఏళ్లు దాటిన తర్వాత కుటుంబ బాధ్యతలు, శరీరంలో మార్పులు కారణంగా మహిళలు అనవసరమైన అదనపు ఒతిడికి గురవుతారు. ఇది డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక రుగ్మతలకు దారి తిస్తుంది. అందుకే అలాంటి సమస్యలు లేకుండా యోగా, మెడిటేషన్‌తో పాటు ఇతర వ్యాయామాలు దినచర్యలో భాగం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: