మధుమేహం ఉన్నవారు నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా..!

lakhmi saranya
చాలామంది నెయ్యిని ఎక్కువగా తింటూ ఉంటారు. ప్రతిదాంట్లోనూ నెయ్యని వేసుకుని తింటారా. మరి కొంతమందికి నెయ్యి అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ బిర్యానీలో నెయ్యి వేస్తే మాత్రం అస్సలు తినకుండా ఉండరు. నెయ్య మీగడ రుద్దితే వస్తుంది. ఆ వెన్నని కాస్తే నెయ్య రూపంలో వస్తుంది. షుగర్ ఉన్నవాళ్లు నెయ్యి తింటే ఏం జరుగుతుంది? ఆవు పాల నుంచి తయారుచేసిన నెయ్యిలోని కొవ్వులు మెటబాలిజమ్ ను మెరుగు పరుస్తాయి. డయాబెటిక్ మేనేజ్ మెంట్ కు ఎంతో ఉపయోగపడతాయి. నెయ్యలో ఎన్నో రకాలు కొవ్వులు ఉంటాయి.
 నెయ్యని ఎక్కువగా తినటం వల్ల బరువు అనేది మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. నెయ్యిలో లినోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఈ లినోలిక్ ఆసిడ్ శరీరంలోకి చేరిన షుగర్స్ ను బ్రేక్ చేసి కణాలు ఉపయోగించుకునేలా చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంతరించే ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. హై గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన అన్నం, బ్రెడ్ తో పాటు నెయ్యి తీసుకోవడం ఎంతో ఉత్తమం. తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ కలిగిన నెయ్యి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. నెయ్యిలోని ఫ్యాటి యాసిడ్స్ గుండెకు అవసరమైన మంచి కొలెస్ట్రాలను అందిస్తాయి.
డయాబెటిక్ రోగులు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నెయ్యి తీసుకోవటం మంచిది. గట్ హార్మోన్లు ఉత్పత్తిలో కూడా నెయ్యి సహాయపడుతుంది. గట్ ఆరోగ్యం మెరుగుపడితే షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. డయాబెటిక్ రోగులు ఎలాంటి సంకోచం లేకుండా నెయ్యి తీసుకోవచ్చు. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కూడా నెయ్యి మంచి ఉపయోగకారి. నెయ్యి నీ క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ఎక్కువ సమయం పాటు రక్తం లోని చక్కెర స్థాయిలో స్థిరంగా ఉంటాయి. కాబట్టి నెయ్యని తినడం ఆరోగ్యానికి మంచిదే. అలా అని మరీ ఎక్కువగా నెయ్యిని తినకండి. ఎందుకంటే మరీ ఎక్కువగా నెయ్యి తింటే బరువు మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తగినంత మాత్రమే తీసుకోవటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: