భార్యాభర్తలు సంతోషంగా ఉండడానికి గల ఉపయోగపడే సీక్రెట్స్ ఇవే..!
కలిసి సమయం గడపాలి. బిజీ జీవితంలో, కలిసి సమయం గడపడం చాలా ముఖ్యం. డేట్ నైట్స్, విహారయాత్రలు, కలిసి వంట చేయటం వంటివి చేయాలి. ఒకే లక్షయాలు, విలువలు ఉండాలి. ఒకే లక్షయాలు, విలువలు ఉన్న జంటలు దాంపత్యంలో సంతృప్తిని పొందుతారు. కుటుంబం, కెరిర్ , అభిరుచులు ఏవైనా, ఉమ్మడి లక్ష్యాలు దగ్గర చేస్తాయి. సర్దుబాటు చేసుకోవాలి. వివాహం, జీవితంలాగే, ఊహించని మార్పులతో నిండి ఉంటుంది. ఈ మార్పులకు అనుగుణంగా మారాలి. అలా మారినప్పుడు ఇద్దరూ కలిసి ఉంటారు. ఒకరినొకరు ప్రశంసించుకోవాలి. ప్రశంసలు, కృతజ్ఞతలు తెలియజేయడం దాంపత్యానికి మంచిది. థాంక్స్, సారీ చెప్పుకోవాలి.
బహుమతులిచ్చి ప్రేమను పెంచుకోవాలి. సంతోషకరమైన దాంపత్యానికి భావోద్వేగా, శారీరక సన్నిహిత్యం ముఖ్యం. ఇది ప్రేమను పెంచుతుంది. ఇలా ఉంటే కలకాలం ఇద్దరూ కలిసి ఉంటారు. ఈరోజుల్లో ఈ ప్రేమ లేక చాలామంది పెళ్లి చేసుకున్న వెంటనే విడాకులని తీసుకుంటున్నారు. చిన్న వాళ్ల దగ్గర నుంచి పెద్ద వాళ్ళు వరకు కూడా ఈ విడాకులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పైన చెప్పిన విధంగా నడుచుకుంటే దాంపత్య జీవితం బాగుంటుంది. ఏదైనా పని చేసుకునేటప్పుడు ఇద్దరూ కలిసి మెలిసి పనిచేసుకోవడం చాలా మంచి. భార్య వంట చేసేటప్పుడు భర్త పక్కనుండి ఏదో ఒక హెల్ప్ చేయటం చాలా ఆనందకరంగా ఫీల్ అవుతారు.