చెడు కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే వీటిని తినండి..!
గుండె ఆరోగ్యానికి దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాలను కూడా దాల్చిన చెక్క కరిగించగలదు. దాల్చిన చెక్కను వివిధ రూపాలలో డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అవిసె గింజలలో ఒమేగా -3 ఫ్యాటి యాసిడ్స్ తో పాటుగా ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాలను కరిగించడంలో సమర్థవంతంగా సహాయపడతాయి. కొలెస్ట్రాలను తగ్గించడంలో, గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో అవకాడో సమర్థవంతంగా పని చేస్తుంది. అవకాడోని తీసుకోవటం వల్ల కడుపు నిండగా ఉంటుంది. అవకాడో తినటం ఆరోగ్యానికి చాలా మంచిది.
ఈ ఫ్రూట్ ని అంతగా ఇష్టపడకపోయినా బలవంతంగా అయినా తినండి. మందారం కొలెస్ట్రాలను కరిగించడానికి సహాయం చేస్తుంది. ఇందులోని ఫాలి ఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యాన్ని ఇస్తాయి. మందార టీ తాగితే మంచిది. మందార టీ మీరు ఎప్పుడూ తాగి ఉండరు. సారీ తప్పకుండా ట్రై చేయండి. కొలెస్ట్రాల్‌ను కలిగించడానికి గోధుమ గడ్డి జ్యూస్ కూడా సాయం చేస్తుంది. గోధుమ గడ్డి జ్యూస్ ను రెగ్యులర్‌గా తీసుకోవడంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. దానిమ్మ రసాన్ని తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకు పోకుండా దానిమ్మ చూస్తుంది. కొత్తిమీర గుండె సమస్యలను తొలగించగలదు. కొత్తిమీర రసం తాగడంతో ఫైపర్ డేన్షన్, కొలెస్ట్రాల్ సమస్యలు కూడా తగ్గుతాయి.