ఏ వయసు వారు ఏం తింటే మంచిది?.. అన్నంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేది ఎలా..?

lakhmi saranya
చాలామంది వయసుకు తగ్గట్టు కాకుండా చిన్న పిల్లల లాగా ఏదో ఒకటి తింటూ ఉంటారు. బతకడానికి ఆహారం తీసుకోవాలి కానీ, అందరి శరీర అవసరాలూ ఒకటి కాదని విషయాన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మహిళల పోషకాల అవసరాలు పురుషులకంటే భిన్నంగా ఉంటాయి. ఏజ్ ను బట్టి మారిపోతుంటాయి. మరి ఏ దశలో ఎలాంటి తీసుకోవాలో చూద్దామా? 10 - 15 ఏళ్ల వయసులో : ఎదిగే ఆడపిల్లలకు ప్రోటీన్ ఎక్కువగా అవసరం ఉంటుంది.
కానీ, ఈ జనరేషన్ పిల్లలు ఇష్టపడే ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వులు అధికంగా ఉంటున్నాయి. ఫలితంగా ఎదుగుదల తగ్గి ఉబకాయం సమస్య బారిన పడుతుంటారు. దీనివల్ల హార్మోన్లు మార్పులు చిన్న వయసులోనే రుతుక్రమం ఆరంభం కావడం. ఇలా కాకూడదండే వారికిచ్చే  డైట్లో ఎగ్స్, ఆకుకూరలు, తాజా పండ్లు, ఆకు పచ్చని కూరగాయలతో పాటు నట్స్, వేరుశనగ, గోధుమలు, పెసలు వంటి పదార్థాలు ఉండేలా చూడండి. స్వీట్లు, కేకులు, చాక్లెట్లకు బదులు ఫ్రూట్ సలాడ్, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు వంటివి ఇస్తే మంచిది. స్నాక్స్ అంటే మొలకల చాట్, సెనగలు, బొబ్బర్లతో చేసిన వంటలు లాంటివి రుచి చూపించండి.
ఇవన్నీ రుచికరంగా ఉంటాయి. దేహానికి శక్తిని ఇస్తాయి. 15 -30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు : టీనేజీ వయసు మొదలుకుని ముప్పైల వరకు మహిళల జీవితంలో కిలకదశ. ఉన్నంత చదువులూ, కెరియర్ , వివాహం లాంటి లైఫ్ లో ఎన్నో కీలక ఘటనలు జరిగేది ఇప్పుడే, ఈ హడావుడిలో పడి సరైన పోషకాహారం తీసుకొని వారు కొందరుండే, బరువు పెరిగి పోతామనే భయంతో లెక్కలు వేసుకుని ఆహారాన్ని తినేవారు మరికొందరు. ఇలా చేయడం నెలసరి మీదే కాదు, పునరుత్పత్తి సామర్థ్యం పైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ వయసు ఉన్నవాళ్లు ఈ విధంగా చేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: