3 జాగ్రత్తలు... 34 రోజులు... 8 కిలోల బరువు తగ్గడం ఎలా...!
ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో ప్రతి ఒక్కరు బరువు పెరిగిపోతున్నారు. బరువు తగ్గటం .. ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడం .. మానవ శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది ప్రతి ఒక్కరికి సవాల్గా మారింది. ప్రస్తుతం మనుష్యులకు కాస్త వ్యాయామం చేయడం ... ప్రశాంతమైన జీవనం గడపడం అనేది సాధ్యం కావడం లేదు.. అంతా ఉరుకు పరుగుల జీవితం అయిపోయింది. ఉరుకులు పరుగులు లేకపోతే మానవ జీవితం ముందుకు కదలడం లేదు. ఇలాంటి టైంలో అందరూ సరైన ఆహార పు అలవాట్లు లేక .. శారీరక శ్రమ లేక బరువు పెరిగి పోతున్నారు. ఇది అనేక రకాల అనారోగ్యాలకు కారణమవు తోంది. అందుకు ప్రతి ఒక్కరు బరువు ను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ క్రమంలోనే 34 రోజుల్లో 8 కిలోలు తగ్గటం అంటే మామూలు విషయం కాదు .. కానీ ఒక మహిళ అది చేసి చూపించింది. ఆ మహిళ పేరు రవిశా చిన్నప్ప ఆమె తన బరువు తగ్గించే రహస్యాన్ని ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకుంది. ఈ క్రమంలోని మూడు విషయాలను దృష్టిలో పెట్టుకుని రవి షా తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. కేవలం ఐదు వారాల లోపే తాను 55 కిలోల నుంచి 47 కిలోలకు తగ్గినట్టు తెలిపింది. 35 ఏళ్ల రవిశా దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నారు. కొవ్వును కరిగించడానికి హైడ్రేషన్ చాలా ముఖ్యం .. కొవ్వును కరిగించుకునే మార్గాలలో హైడ్రేషన్ ఒకటని రవి షా పేర్కొన్నారు.
రవి షా ప్రతిరోజు ఆమె ఫోన్లో టైమర్ సెట్ చేసుకుని ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి 90 నిమిషాల పాటు అలారం సెట్ చేసి ఆ టైమర్ కి నీరు తాగాలి అని పేరు పెట్టుకున్నారట. అలా అలారం మోగినప్పుడు రవిశ 20 సిప్ ల నీరు తాగుతుందట. దీంతో పాటు టైం కు నిద్రపోవటం ... రాత్రి పడుకునే ముందు మూడు గంటలకు ముందే డిన్నర్ పూర్తి చేయటం కూడా ఇందులో ఒక భాగంగా ఆమె చెప్పారు.